ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని నిర్ణయించామని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగు భాష ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉంటాయని ఆయన అన్నారు. గత ఐదేళ్లూ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ వేడుకలు మరిచిపోయారని, బెంజ్ సర్కిల్ లో దీక్షలు చేసిన ప్రజలను ఇబ్బంది పెట్టడమే బాబుకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ విభాగంలో చంద్రబాబు రూ.68 వేల కోట్లు మేరకు దుర్వినియోగం చేశారని, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆయన కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో సినిమా స్టిల్స్ పనికిరావని వ్యాఖ్యానించారు. ఇసుక సమస్యపై లోకేష్ దీక్ష వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఐదేళ్లూ ఆహార దీక్ష చేసి ఐదు గంటలు నిరాహార దీక్షా? అని ఆయన ప్రశ్నించారు.
previous post