38.2 C
Hyderabad
April 29, 2024 12: 24 PM
Slider ఖమ్మం

ధాన్యం సేకరణకు ఏర్పాట్ల

#addl.collector

వచ్చే రబీ సిజన్‌ ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూధన్‌ ఏజెన్సీ బాధ్యులకు సూచించారు.   ఐడిఓసి సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్‌, సహకార శాఖ అధికారులతో  రబీ 2022-23 సీజన్‌ వరిధాన్యం సేకరణ కార్యకలాపాలపై అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ 4,00,000 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని భావిస్తున్నామని, వరి సేకరణ ఏజెన్సీలకు సూచించామని,  రైతుల నుండి సరసమైన సగటు నాణ్యతతో కొనుగోలు చేయడానికి సహకార, జిల్లా గ్రామీణాబివృద్ధి మార్కెటింగ్‌, డి.సి.ఎం.ఎస్‌ శాఖల ద్వారా 234  కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.  ప్రాథమిక సహాకర సంఘాల ద్వారా148, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 53, డి.సి.ఎమ్‌.ఎస్‌ ద్వారా 29 మరియు మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని,  ప్రతి పిపిసిల వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలని వరి సేకరణ ఏజెన్సీలకు ఆయన సూచించారు, షామియానా, తాగునీరు, విద్యుత్‌ కనెక్షన్‌,  తగినన్ని టార్పాలిన్లు పాడీ క్లీనర్లు, ట్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సరసమైన సగటు నాణ్యత ప్రకారం శుద్ధి చేసిన ధాన్యాన్ని పిపిసిలకు తీసుకురావడానికి రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 2023 ఏప్రిల్‌ మొదటి వారంలో వరి కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అన్నారు. జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి రాజేందర్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ సోములు, జిల్లా సహకార శాఖ అధికారి విజకుమారి,డి.సి.ఎమ్‌.ఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సందీప్‌, లీగల్‌ మెట్రాలజీ అదికారి      ఉమారాణి, పి.డి ఆర్‌.డి.ఏ విద్యాచందన, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ సివిల్‌ సప్లయిస్‌ నర్సింహారావు,  డిప్యూటీ తహశీల్దార్లు తదితదురులు సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

దళితుల నిధులు ఖర్చు చేయని సీఎం కేసీఆర్

Satyam NEWS

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీ ‘ఆది పర్వం’ ప్రచార చిత్రానికి అసాధారణ స్పందన

Satyam NEWS

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి

Satyam NEWS

Leave a Comment