40.2 C
Hyderabad
May 2, 2024 18: 15 PM
Slider ఖమ్మం

పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి కావాలి

#collector

మన ఊరు- మనబడి, మన బస్తీ `మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు.  ఐడిఓసి సమావేశ మందిరంలో మన ఊరు మనబడ,మన బస్తీ `మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్‌  వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల ఇఇ, డిఇ, ఏఇలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  జిల్లాలో మన ఊరు మన బడి, మన బస్తీ `మనబడి కార్యక్రమం కింద మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, పనులు వివిధ దశల్లో పురోగతిలో వున్నాయన్నారు. పాఠశాలల్లో 12 రకాల పనులను పక్కగా చేపట్టేందుకు ఏఇ, డిఈ,  ఎక్కువ సమయం తీసుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. పంచాయత్‌ రాజ్‌, రోడ్లు భవనాలు, నీటిపారుదల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టే పనులకు  ఎటువంటి నిధులకు కొరతలేదని, ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా 30 లక్షలకు రూపాయలకు పైగా చేపట్టాల్సిన పెండిరగ్‌ పనులకు టెండర్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని నిర్మాణాలు చేపట్టే దగ్గర కార్యాచరణ చేయాలన్నారు.

విద్యాశాఖ, ఇంజనీరింగ్‌ శాఖ, పాఠశాల నిర్వహణ కమిటీలు సమన్వయం తో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్ని పాఠశాలల పనులు పూర్తి అయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా వున్నాయో జాబితా ఇవ్వాలన్నారు.  పనులు పూర్తయినచోట త్వరితగతిన  ప్రారంభోత్సవం  జరగాలని, మే 31 లోగా అన్ని పాఠశాలలు పనులు పూర్తయి ప్రారంభోత్సవం పూర్తి చేసుకోవాలన్నారు. పనులు పూర్తికాగానే ఎంబి రికార్డు, ఎఫ్డివోల జనరేషన్‌ వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు.  మిగులు పాఠశాలల పనులు విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రతిపాదనలు ఇంకనూ పెండిరగులో ఉంటే వెంటనే సమర్పించాలన్నారు.      ఉపాధి హామీ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెయింటింగ్‌, డ్యూయల్‌ డెస్క్‌ల సరఫరా జాప్యం కాకుండా చూడాలన్నారు. ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తయి, విద్యార్థులు ఉత్సాహంగా, క్రొత్త వాతావరణంలో మంచిగా విద్యను అభ్యసిస్తారని కలెక్టర్‌ తెలిపారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహాలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణా కలెక్టర్‌ రాధిక గుప్తా,  డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా పంచాయితీ అదికారి వి.వి.అప్పారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు నాగశేషు, కెవికె. శ్రీనివాస్‌, శ్యామ్‌ ప్రసాద్‌, హేమలత, తాణాజి, కృష్ణలాల్‌, ఎంఐఎస్‌ రామకృష్ణ,  వివిధ ఇంజనీరింగ్‌ శాఖల డిఇలు, ఎఇలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై నిరసన

Satyam NEWS

కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ముగింపు

Satyam NEWS

కరోనా విజృంభిస్తున్న వేళ ఉపయోగపడే హెల్త్ పాలసీ

Satyam NEWS

Leave a Comment