38.2 C
Hyderabad
April 28, 2024 22: 30 PM
Slider మహబూబ్ నగర్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

#stateformaionday

తెలంగాణ ఆవిర్భావోత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

జిల్లా పోలీస్ పరేడ్ మైదానం లో ఉదయం జాతీయ పతాకావిష్కరణ, ముఖ్య అతిథికి పోలీస్ గౌరవ వందనం, జిల్లా ప్రజలనుద్దేశించి ముఖ్య అతిథి ప్రసంగం చేస్తారన్నారు.  వివిధ శాఖల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  మధ్యాహ్నం 4 గంటల నుండి కలెక్టరేట్ లో కవిసమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు.

ఈ ఆవిర్భావ వేడుకలు ఘనంగా సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖాధికారులకు బాధ్యతలను అప్పగించారు.  ప్రోటోకాల్ బాధ్యత ఆర్డీఓ చూసుకోవాలని, మైదానం బారికేడింగ్ ఈ.ఈ ఆర్.అండ్ బి శాఖ, సుందరీకరణ బాధ్యతను ఉద్యానవన అధికారికి అప్పగించారు. 

ఉదయం పరేడ్ గ్రౌండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.  వీటికి తోడు అయా శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నెరవేర్చాలని ఆదేశించారు. గత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నర్సరీ ఏర్పాటులో బాగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రధానం చేసి సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, పోలీస్ శాఖ నుండి డి.ఎస్పీ దీపక్ చంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

కాథలిక్ చర్చి నన్ మర్డర్ కేసులో ఫాదర్, సిస్టర్ దోషులు

Satyam NEWS

భద్రాచలానికి రూ. వెయ్యి కోట్ల హామీ ఏమైంది..?

Bhavani

Leave a Comment