29.7 C
Hyderabad
May 2, 2024 05: 50 AM
Slider ప్రత్యేకం

కామారెడ్డిలో బండి సంజయ్ అరెస్టు అన్యాయం

#Tarun Chugh

కామారెడ్డిలో తమ సాగుభూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసుల లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తెలిపారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్టు చేయడాన్నీ తీవ్రంగా ఖండించారు.

అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోంది. స్వతంత్య్ర భారత చరిత్రలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. రైతు వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎంతో కాలం మనలేదనేది వాస్తవం. 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారనేది ఆయన విధానాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ అనుచరులు రైతుల భూములను ఆక్రమించుకునేందుకే ధరణి పోర్టల్ ఉపయోగపడుతోంది.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ హామీ అమలు నెరవేర్చడంలోనూ కేసీఆర్ విఫలమయ్యారు. ఫలితంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సొమ్మును రుణాల కిస్తీ కింద జమగట్టి, రైతుల చేతికి డబ్బులు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయి. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎగతాళి చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆయన అన్నారు.

కామారెడ్డిలో రైతులు చేపడుతున్న ఆందోళన కేవలం మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి సారవంతమైన తమ భూములు లాక్కున్నందుకు కాదు, ఇది రైతుల్లో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహలకు, టీఆర్ఎస్ విధానాల వల్ల వారు అనుభవిస్తున్న కష్టాలకు అద్దం పడుతుంది. నిన్న రైతులు, బిజెపి కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీ ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయనడానికి సంకేతం.

కామారెడ్డిలో రైతులు, బిజెపి కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రియల్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.

Related posts

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

గన్నవరం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Satyam NEWS

శ్రీ‌వారి సేవ‌కులు, స్కౌట్స్‌ వైకుంఠ ఏకాద‌శి నాడు మెరుగైన సేవ‌ అందించాలి

Satyam NEWS

Leave a Comment