28.7 C
Hyderabad
April 28, 2024 09: 41 AM
Slider మహబూబ్ నగర్

పెంట్లవెల్లి లో సాంప్రదాయబద్దంగా పెద్ద దేవర్లు

pentlavelly

కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంగళ వారం నాడు పెద్ద దేవర్లు ఉత్సవాలు నిర్వహించుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ ఉత్సవాలు నిర్వహించుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ శాంతి కోసం జరుపుకునే ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.

రాత్రి అంతా గ్రామంలో ఊరేగింపు జరుపుకుని గ్రామ దేవతకు పలహారం సమర్పించి భక్తి శ్రద్ధలతో పెద్ద దేవర్లు జరుపుకున్నారు. చాలా సంవత్సరాలుగా పెద్ద దేవర్లు జరిపే ఆనవాయితీ ఉన్నా గత కొద్ది కాలంగా జరపడం లేదు. దాంతో గ్రామంలో కొన్ని అశుభాలు జరిగాయని కొందరి నమ్మకం.

దాంతో మళ్లీ పెద్ద దేవర్లు జరుపుకోవాలని నిర్ణయించారు. పెంట్లవెల్లి మండల కేంద్రంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. తమ ఊరు మండల కేంద్రం కూడా అయినందున గ్రామస్థులు మరింత ఉత్సాహంతో పెద్ద దేవర్లు ఉత్సవాలలో పాల్గొన్నారు.  మండలం కేంద్రంలోని ప్రతి ఇంటి వారూ ఇంటికి సుమారు 30 మంది వరకూ  బంధువులను ఆహ్వానించి ఈ సంబరాలు జరుపుకున్నారు.

పెంట్ల వెల్లి గ్రామంలో సుమారు లక్ష మందికి పైగా పెద్ద దేవర్లో పాల్గొన్నారు. బంధువులతో ఫొటోలు దిగి ఉత్సాహంగా గడిపారు. ఈ చిత్రంలో ఔట రాజశేఖర్ పావనం పద్మ అల్లుడు గోవింద్ కుటుంబసభ్యులతో ఉన్నారు.

Related posts

పేదల ఆకలి తీరుస్తున్న బీజేవైఎం, ఆశాజ్యోతి ఫౌండేషన్

Satyam NEWS

రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధి కోసం విపక్షాల అన్వేషణ

Satyam NEWS

కాంగ్రెస్ లోకి జూపల్లి: బోగస్ ప్రచారంపై మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

Leave a Comment