37.2 C
Hyderabad
May 2, 2024 14: 40 PM
Slider నల్గొండ

ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: మాశెట్టి అనంత రాములు

#hujurnagar

ఆర్య వైశ్యుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మా శెట్టి అనంతరాములు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,సంఘ సేవకుడు, మృదు స్వభావి,మాశెట్టి అనంత రాములు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మాశెట్టి అనంతరాములు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం కొరకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఆర్యవైశ్యులలో ఉన్న పేదలను గుర్తించి వారికి ఆర్థిక, హార్దిక సహాయ సహకారం అందించడం కొరకు శక్తి వుంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తాను జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్య సోదర, సోదరీమణులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణం కొరకు పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు సుమారు 30 లక్షల రూపాయలు విరాళములు ఇచ్చుటకు వాగ్దానం చేశారు. ఎన్నికల నిర్వాహకులుగా ఊర లక్ష్మణ్,ఇరుకుల రామకృష్ణ లు వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ప్రస్తుత జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కర్నాటి కిషన్,ప్రధాన కార్యదర్శి గరినే శ్రీధర్, కోశాధికారి బొమిడి లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు గుండా రమేష్ బాబు,బచ్చు రామారావు,సింగరికొండ శ్రీనివాస్,మట్టపల్లి వెంకట నారాయణ, ఓరుగంటి నరసింహారావు,పోలిశెట్టి నరసింహారావు,గెల్లి విద్యాసాగర్, గెల్లి రవికుమార్,వీర్లపాటి భాస్కర్, పాపారావు,చల్లా రామమూర్తి,వెంపటి మధు,చల్లా ప్రకాష్,వెంపటి వెంకటేశ్వర్లు, మొరిశెట్టి శ్రీనివాసు,మంచాల రంగయ్య మీలా మహదేవ్,కోటగిరి రాధాకృష్ణ,తోట శ్యాంప్రసాద్,రాచర్ల కమలాకర్,బండారు రాజా,దేవరశెట్టి సత్యనారాయణ,  సింగరికొండ రవీందర్,గుండా శ్రీదేవి,మీలా వంశీ,గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం,కలకోట లక్ష్మయ్య, గుండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సానుకూల స్పందనతో పరుపు నిలుపుకున్న కాంగ్రెస్

Satyam NEWS

మట్టి మిద్దె కూలిపోయి ముగ్గురు మృతి

Satyam NEWS

ఘనంగా లక్ష్మక్క పల్లె శ్రీ సీతారామ కల్యాణం

Satyam NEWS

Leave a Comment