29.7 C
Hyderabad
May 1, 2024 03: 57 AM
Slider వరంగల్

ఆసరా పింఛన్లు బ్యాంకు సర్వీస్ ద్వారా అందించాలి

asara pinsions

ఆదివారం జిల్లా కేంద్రంలోని NPRD కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక [NPRD] ములుగు జిల్లా అధ్యక్షుడు- బుద్దె సదానందం మాట్లాడుతూ ఇతర జిల్లాలలో మాదిరిగా ఆసరా పింఛన్ లబ్ధిదారుల వెసులుబాటు మేరకు బ్యాంక్ సర్వీస్, పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారా పింఛన్ల పంపిణీ ప్రక్రియ చేప‌ట్టాల‌ని అన్నారు.

ఇతర జిల్లాలలో ఈ విధానం ఉందని దీని ద్వారా ఆసరా పెన్షన్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయ‌ని, ములుగు జిల్లాలో మాత్రం కేవలం ఒక పోస్టల్ సర్వీస్ ద్వారా మాత్రమే పించన్స్ అందిస్తున్నార‌ని అన్నారు. దీనివల్ల అన్ని రకాల పింఛన్ దారులు ఒకే చోట గుమిగూడటం, రోజుల తరబడి పోస్టాఫీసు దగ్గర నిరీక్షిస్తున్నార‌న్నారు.

ఈ విధానం వలన కరోనా పరిస్థితులలో లబ్ధిదారులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు పింఛన్‌దారుల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. కాబ‌ట్టి జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి DWO, MPDO ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆసరా పింఛన్ బ్యాంకు ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందే విధంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రాజధాని లేని దురదృష్టకర రాష్ట్రంగా ఏపీ

Bhavani

మత్స్యకారులకు మేలు చేసే చెరువుల ఆక్రమిస్తే సహించేది లేదు

Satyam NEWS

వైఎస్ షర్మిల సమక్షంలో పలువురు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరిక

Satyam NEWS

Leave a Comment