38.2 C
Hyderabad
April 29, 2024 22: 19 PM
Slider ఆదిలాబాద్

మీ కోసం పోలీస్: ఆదివాసులు విద్యావంతులు కావాలి

#asifabad police

ఆదివాసులు విద్యావంతులైన అప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వై వి సుధీంద్ర అన్నారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషిన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా  విచ్చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన  ఆరు6 కీ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

అంతకుముందు ఆయన హరితహారం కార్యక్రమం లో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి పంగిడి మధరారైతు వేదిక వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులు విద్యావంతులు అయినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని పేర్కొన్నారు వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషిన్ నేర్చుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరు గురికి  పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా  ఆ సంస్థ తరపున  కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు

కుట్టు మిషన్ శిక్షణను అభ్యసించిన  మిగతా సభ్యులకు కూడా అతి త్వరలోనే ప్రభుత్వం తరఫున కుట్టు మిషన్ లను అందించనున్నట్లు తెలిపారు కుట్టు మిషను శిక్షణ పూర్తి చేసుకున్న 36 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఆదివాసి మహిళాలను స్వయం ఉపాధి వైపు మళ్లి చేందుకు టైలరింగలో  శిక్షణ ను అందిస్తున్న వసుంధ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు ఉమా ను వారి అభ్యున్నతికి సహకరిస్తున్న తిర్యానీ ఎస్సై రామారావును ఆయన అభినందించారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అ‌చ్చేశ్వరరావు,రెబ్బెన సర్కిల్ సిఐ సతీష్ కుమార్ తిర్యానీ ఎస్ ఐ రామారావు  వసుధ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు  ఉమా ఎంపీటీసీ కేశవరావు ఆయా గ్రామాల సర్పంచులు జంగు బొజ్జ రావు  ఆయా గ్రామాల పటేలు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రాజధాని అమరావతి కోసం కన్నా దీక్ష ప్రారంభం

Satyam NEWS

అక్బరిజం:మందిర్ విస్తరణ మసీద్ మరమ్మతు

Satyam NEWS

చంద్రబాబు అరెస్టుపై ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment