38.2 C
Hyderabad
April 27, 2024 15: 06 PM
Slider మహబూబ్ నగర్

మల్లాయిపల్లి మైనర్ బాలిక అత్యాచారం కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పజెప్పాలి

#mandakrishnamadiga

వనపర్తి జిల్లా పానగల్ మండలం మల్లాయిపల్లి గ్రామంలో జరిగిన మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార కేసును ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్ పీఎస్ నేత మంద కృష్ణ డిమాండ్ చేశారు. దళితులపై దాడులు, మహిళలపై హత్యలు,అత్యాచారం దౌర్జన్యలకు సంబంధించిన కేసులను ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులుగా పెట్టినప్పటికి విచారణ మాత్రం నెలలు,సంవత్సరాలు గడుస్తున్నదని, తద్వారా కేసు నిరుగారిపోతుందని చెప్పారు.

సాక్ష్యాలు తారుమారు అవుతున్నవని, అలా జరగకుండా ఉండాలనుకుంటే బాధితులకు న్యాయం చేయాలనుకుంటే అన్ని అత్యాచార కేసులను ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.  జిల్లాలో ఎస్పీ మహిళ,కలెక్టర్ మహిళ కాబట్టి జిల్లాలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగకూడదని అనుకుంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని చట్టప్రకారం వారిని శిక్షించాలని కోరారు. ఈ కేసును ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించడంలో జాప్యం జరిగితే జిల్లాలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేస్తామని, న్యాయం కోసం పోరాడతామని, జిల్లాలో సర్పంచులపై,మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు.

అందుకు నిరసనగా దళిత ప్రజానీకాన్ని బాధితులను ఏకం చేసి ఈ నెల 24న వనపర్తి జిల్లా కేంద్రంలో దళితుల పెద్ద ఎత్తున  నిరసన ప్రదర్శనలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరిగాయని, చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాలలో, రెండవ ఘటన మల్లాయిపల్లి మైనర్ బాలికపై అత్యాచారం ఘటన రోజు రోజుకు హత్యలు,దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నవన్నారు.చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం కావడం వాళ్లనే ఘటనలు పెరిగిపోతున్నాయని తెలిపారు.

ప్రియాంక రెడ్డిపై అత్యాచారం జరిగితే నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారని, కానీ వందల సంఖ్యలో అందులో ఒక్కటి అయిన టేకు లక్ష్మిపై అత్యాచారం జరిగితే కనీసం నిందితులను అరెస్టు కూడా చేయలేదని చెప్పారు. టేకు లక్ష్మీ బెడ బుడగ జంగం కులానికి చెందిన దళితురాలు కాబట్టే న్యాయం చేయలేదని, అని పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వం అన్ని జిల్లాలో ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అన్ని జిల్లాలో ఫాస్ట్రాక్ కోర్టులు మాదిగ రిజర్వేషన్ పోరాట ఫలితంగానే ప్రభుత్వం కోర్టులు ఏర్పాటు చేసి ఆ నిందితులకు వారం పది రోజుల వ్యవధిలోనే శిక్ష ఖరారు అయిన చట్టం నుండి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టుకు కేసులను అప్పజెప్పడం ద్వారా నేరాలు తగ్గే అవకాశం కూడా ఉందని సూచిస్తున్నామని చెప్పారు.ఇప్పటి వరకు మల్లాయిపల్లి ఘటనకు సంబంధించి కేసును ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పజెప్పక పోవడం వాళ్లనే మరల అమ్మాయికి బెదిరింపులు వస్తున్నాయని,

ఈ కేసులో జాప్యం జరిగితే ఉరుకునేది లేదని, ఎంత వరకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో చివరి 10 సంవత్సరాలు గా జరిగిన దాడులను పరిశీలన చేస్తే,తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గడిచిన 7 సంవత్సరాలు 6 నెలల కాలంలో ప్రతి సంవత్సరం డిజిపి గారు చెప్పే లెక్కల ప్రకారం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు రెట్లు అధికంగా ఘటనలు జరిగాయని స్వయంగా డిజిపి  చెప్పే లెక్కలు అందుకు నిదర్శనం అని గుర్తు చేశారు.

హక్కులు, ఆత్మగౌరవం విషయంలో తేడా వస్తే సహించేది లేదని, మరో పోరాటానికి అయిన సిద్ధపడతామని మరోమారు గుర్తు చేశారు. మాకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాన్ని కూడా వచ్చే ఎన్నికలలో గద్దె దించుతామని అందుకు కూడా మేము సిద్ధపడతామని హెచ్సరించారు.బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం చేసి, ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, సాగుకు అనువైన ఐదు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు, చట్ట ప్రకారం అందాల్సిన ఏకగ్రేషియా అందించాలని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గద్వాల కృష్ణ, (మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ), కోళ్ళ శివ మాదిగ, బోరెల్లి వెంకటయ్య మాదిగ, గంధం లక్ష్మయ్య మాదిగ, రాజనగరం రాజేష్ మాదిగ, మంద నరసింహ మాదిగ, గంధం నాగరాజు మాదిగ, రాజారాం ప్రకాష్, (ప్రజా వాగ్గేయ కారుడు) భగత్, సాయిలీల, మిద్దె నాగన్న మాదిగ, కొమ్ము చెన్నకేశవులు మాదిగ, వంగలి నాగరాజు, జనంపల్లి వినోద్ కుమార్ మాదిగ, గట్టు స్వామి మాదిగ, మల్లాయిపల్లి రామస్వామి మాదిగ, టీ. రాము మాదిగ, కార్తిక్ మాదిగ, శాన్ మాదిగ,  యాది మాదిగ, మీసాల నాగరాజు మాదిగ, కొమ్ము చెన్నయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గ్రామస్థులు కుటుంబ సభ్యులు జిల్లాలో వివిధ మండలాల దళిత ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు,  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మంచి దృక్పథమే విజయానికి సోపానం

Satyam NEWS

Analysis: మహాత్ముడికి మహా అవమానం

Satyam NEWS

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment