29.7 C
Hyderabad
May 3, 2024 04: 56 AM
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు  ఖాయం

#raghurama

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు తప్పనిసరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం అరెస్టు తప్పనిసరి, కానీ అరెస్టు కాకూడదు అన్నది నా కోరిక… అవుతారనేది నా నమ్మకం అని అన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న  సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆధారంగా వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్ట్ ఒకసారి తప్పదని    మాజీ పోలీసు అధికారి ఒకరు తనకు వెల్లడించారని వివరించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు  ముందు, తరువాత  వైయస్ భాస్కర్ రెడ్డి నివాసంలో  నిందితులంతా సమావేశమైనట్టు గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా సిబిఐ తన కౌంటర్ పిటిషన్ లో  పేర్కొందని చెప్పారు. ఇదే విషయాన్ని సదరు పోలీసు అధికారి ప్రస్తావిస్తూ, ఒకవేళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను అరెస్టు చేయకపోతే, అదే న్యాయస్థానంలో సిబిఐ పెను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారన్నారు.

ఇప్పటికే అప్రతిష్ట పాలైన సిబిఐ, మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. చార్జిషీట్లో మోపిన అభియోగాలే తప్పయితే శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి వీళ్ళు ఎవరు కూడా  వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయలేదని ఆకాశము నుంచి గంధర్వులు,  కిం పురుషులు దిగివచ్చి హత్య చేసి వెళ్లిపోయారని అంటే ఏమీ చేయలేమన్నారు. విచారణ చేసేది సిబిఐ సంస్థ, సాక్షి దినపత్రిక యాజమాన్యం కాదని ఎద్దేవా చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న  అంశాలే చెల్లుతాయని, సాక్షి దినపత్రికలో రాసే ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావని రఘురామకృష్ణం రాజు  స్పష్టం చేశారు.

జగన్ పైనున్న సిబిఐ కేసులు వేగం పుంజుకునే అవకాశం

కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్టులకు నిరసనగా తిరగబడాలని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనున్న సిబిఐ  కేసులు వేగం పుంజుకునే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. పార్టీకి చెందిన తనలాంటి కార్యకర్తలు, అరెస్టుల గురించి బాధపడకుండా శాంతియుతంగా ఉండాలి. అరెస్టు అయిన వారు  వారానికో, పది రోజులకు, నెల కైనా బయటకు వస్తారన్న విషయాన్ని  పార్టీ అగ్ర నాయకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అరెస్టుకు నిరసనగా రాజీనామాలు చేస్తామని చెబుతున్న కడప ఎమ్మెల్యేలు గ్రహించాలి.

జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అంతిమంగా ధర్మానిదే విజయని, నిర్దోషులుగా బయటకు రావాలని కోరుకోవడం మినహా, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు చేయగలిగింది ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాజ్యసభలో సంపూర్ణ ఆదిక్యత లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఒక దశ వరకు మాత్రమే సహించే అవకాశం ఉంటుంది. ఈనెల 10వ తేదీన విచారణ అనంతరం ఏమి జరుగుతుందో వేచి చూడాలని అన్నారు.

ఈనెల ఆరవ తేదీన  విచారణకు హాజరు కావాలని  వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు ముందస్తుగానే నోటీసులు ఇచ్చినప్పటికీ, గృహ సారధులు, పార్టీ కార్యకర్తలతో తనకు సమావేశం ఉందని చెప్పి… ఫ్రీ గా ఉన్నప్పుడు వస్తామని చెప్పడం, దానికి సిబిఐ చిత్తం దొర అని అంగీకరించడం రాష్ట్ర ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రతి ఒక్కరికి రాజకీయ సమావేశాలు ఉంటాయని, ఎంపీ అయిన రాజకీయ నాయకులకు, సిబిఐ వద్ద  ఇంతటి వెసులుబాటు లభిస్తుందని  తనకు తెలియదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం తీరికలేని కార్యక్రమాలలో ఉన్నానని చెబుతున్న అవినాష్ రెడ్డి, పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత విచారణకు హాజరవుతానని చెప్పే అవకాశాలు లేకపోలేదని అపహాస్యం చేశారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలనే నీచ మనస్తత్వం మాత్రమే  తమ పార్టీ వారికి ఉంటుందని, పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగితే మాత్రం పైకి చిరునవ్వులు చిందిస్తూ మంచి మనసున్న వ్యక్తిలా జగన్మోహన్ రెడ్డి నటిస్తారు. వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు గురించి  పార్టీని నిజంగా ప్రేమించే తనలాంటి  కార్యకర్తలు కంగారు పడవద్దు. మౌనంగా నిర్దోషులుగా విడుదల కావాలని ప్రార్థిద్దామని రఘురామకృష్ణం రాజు సూచించారు.

Related posts

నవంబర్‌ 26న సంయుక్త కిసాన్‌ మోర్చా ఛలో రాజ్‌భవన్‌

Bhavani

7న వాసా వెంక‌ట వ‌ర ప్ర‌సాద్ కు నివాళి కార్య‌క్ర‌మం

Satyam NEWS

శ్రీకాకుళంలో మరో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు

Satyam NEWS

Leave a Comment