29.7 C
Hyderabad
May 2, 2024 05: 11 AM
Slider ప్రత్యేకం

నవంబర్ 12 నుంచి బాలోత్సవ్

#balotsav

భద్రగిరిగా పేరుగాంచిన భద్రాచలం లో  వచ్చే నెల 12 నుంచి బాలల పండుగ సందర్భంగా రామయ్య సన్నిధిలో ‘బాలోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కె నాయుడు  బుమ్మిసెట్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులకు బాలోత్సవం ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు.

చిన్నారుల కళా ప్రదర్శనలు 24 అంశాలు  44 విభాగాల్లో పోటీలు ఉంటాయని, నేషనల్ లైవ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వచ్చే నవంబర్ 12 నుంచి 14 వరకు శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియం ఎదురుగా చిత్రకూట మండపంలో బాలోత్సవం జరుగుతుందన్నారు. 4 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు పాల్గొనే ఈ వేడుకల్లో మూడు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని, 4 – 6 వయసు గల వారిని సబ్ కేటగిరీగా , 7 – 10 మధ్య వారిని జూనియర్లుగా , 11 – 16 మధ్య వయసు గల వారిని సీనియర్లుగా విభజిస్తారని వివరించారు .

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పరస్పర ఆలోచనల మార్పిడి , స్నేహభావనాకు బాలోత్సవం  ఉపయోగపడుతుందని . పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికి తీసేందుకు దశాబ్ధ కాలంగా భద్రాచలంలో ఆటా బాలోత్సవం నిర్వహిస్తున్నాం అని, బాలోత్సవక్కు వచ్చే విద్యార్థులందరికీ ఉచిత వసతి , భోజనం , ఉచిత ఎంట్రీలు కల్పిస్తామన్నారు .

Related posts

శ్రమించి పనిచేసే టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు

Satyam NEWS

బ్యాంకులు పనిచేస్తున్నాయి

Sub Editor 2

గన్నవరం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment