30.7 C
Hyderabad
April 29, 2024 06: 54 AM
Slider నల్గొండ

గ్రామ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

#tumgaturthy

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని,అప్పుడే అటువంటి నేరాలను అరికట్టవచ్చని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సిఐ నాగార్జున గౌడ్ అన్నారు. మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో సైబర్‌ నేరాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడాతూ  సైబర్‌ నేరాలపై గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అనుకోకుండా మీ అకౌంట్లలోకి అమౌంట్ పడ్డాయి తిరిగి పంపించండని అడిగే

పరిచయం లేనివారికి ఆన్లైన్లో నగదు బదిలీ చేయొద్దన్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంకు అధికారులమని, మీ బ్యాంకు ఎకౌంటు క్లోజ్ అవుతుందని,దాన్ని రెన్యువల్ చేయాలని మరియు మీ ఫోన్ కి ఓటిపి వస్తుందని అట్టి ఓటిపి చెప్పాలని ఫోన్ చేస్తే అటువంటి వారికి ఓటీపీలు చెప్పవద్దని, ఒకవేళ చెప్తే మీ బ్యాంకులో ఉన్న డబ్బు ఖాళీ అవుతుందని తెలిపారు.ఇటువంటి బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలపాలని సూచించారు.ఫేస్బుక్ ఉపయోగించేవారు తమ ప్రొపైల్ ను లాక్ చేసుకోవాలని సూచించారు.

యువత ద్విచక్ర వాహనాలు నడిపెటప్పుడు హెల్మెట్ తప్పనిసరి పెట్టుకోవాలని,త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపోద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం సిఐ, మద్దిరాల ఎస్ఐ వెంకన్న గౌడ్, నూతనకల్ ఎస్ఐ ప్రసాద్,తుంగతుర్తి ఎస్ఐ డానియల్, నాగారం ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ…!

Satyam NEWS

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

రోడ్ ప్రమాదాల నియంత్రణ కు చర్యలు చేపట్టండి

Satyam NEWS

Leave a Comment