26.7 C
Hyderabad
April 27, 2024 10: 17 AM
Slider అనంతపురం

క్షౌర వృత్తిలోకి కార్పొరేట్లు రావడం పై నిరసన

#haircutting

క్షవర వృత్తిదారుల జీవనాన్ని దెబ్బతీసే విధంగా రిలయన్స్ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపెనీలు,కార్పొరేట్ సెలూన్లు ముందుకు రావడాన్ని నిరసిస్తూ నాయీ బ్రాహ్మణలు ఎమ్ ఆర్ వో కు నేడు వినతి పత్రం సమర్పించారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్న నాయి బ్రాహ్మణుల పొట్ట కొట్టడం కార్పొరేట్ సంస్థలకు తగదని వారన్నారు. సేవా,సంప్రదాయ వృత్తిని కూడా వ్యాపారం చేయడం సిగ్గుచేటు. కార్పొరేట్ వ్యవస్థ ద్వారా సేవా వృత్తిని వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.

లక్షల పెట్టుబడులతో సెలూన్లు, బ్యూటీ ఫార్లర్లు పెట్టడం ద్వారా చిన్న, చిన్న సెలూన్లు, దుకాణాలు దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. వీటిని ఏర్పాటు చేయకుండా అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నాయి బ్రాహ్మణుల (సెలూన్ల) క్షవర వృత్తి భద్రత కోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సెలూన్లను నడుపుతూ జీవనాధారం పొందుతున్న నాయి బ్రాహ్మణులకు అండగా నిలవాలని, నాయి బ్రాహ్మణుల కులవృత్తి హక్కును ఇతర సామాజిక వర్గ,కులస్తులకు, బడా పెట్టుబడిదారీ కంపెనీలకు,అవకాశం ఇవ్వకుండా,క్షవర వృత్తిపై,నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పేటెంట్ హక్కు కల్పించాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జాతీయ నాయి బ్రాహ్మణ సవితా సమాజం అనంతపురం అధ్యక్షులు CM రాజు, వెంకటేశులు, మల్లికార్జున, రామంజి, రాము, శీను, ప్రసాద్, నగేష్, నితీష్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

శ్రీనివాసపురం కాలనీలో కార్పొరేటర్ కక్కిరేణి చేతన పర్యటన

Satyam NEWS

పట్టణాల అభివృద్ధి టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం తోటే సుసాధ్యం

Satyam NEWS

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment