38.2 C
Hyderabad
May 3, 2024 20: 29 PM
Slider జాతీయం

సరిహద్దుల్లో చైనీస్ మొబైల్ ఫోన్ల పై నిషేధం

#chinaborder

చైనీస్ మొబైల్ ఫోన్ల వల్ల ప్రమాదమని భారత రక్షణ నిఘా సంస్థలు హెచ్చరించాయి. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) వెంబడి చైనాతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన మధ్య, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారతీయ సైనికులు చైనీస్ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదని హెచ్చరించాయి. మిలిటరీ ఫార్మేషన్‌లు, యూనిట్లు తమ సిబ్బందిని చైనీస్ మొబైల్ ఫోన్‌లు వాడకుండా జాగ్రత్తగా ఉండేలా చైతన్యవంతులను చేయాలని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశారు. సైనికులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా చైనా దేశంలో తయారయ్యే ఫోన్‌లను కొనడం లేదా ఉపయోగించడం మానుకోవాలని సైనిక గూఢచార సంస్థలు కోరాయి. చైనీస్ కంపెనీల మొబైల్ ఫోన్‌లలో మాల్వేర్ మరియు స్పైవేర్ ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించిన తర్వాత చైనా మొబైల్ ఫోన్‌ల వినియోగానికి వ్యతిరేకంగా సాయుధ బలగాలు సలహా ఇచ్చాయి.

ఈ మొబైల్ ఫోన్లు ప్రమాదకరమైనవి

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలాంటి మొబైల్ ఫోన్‌ల జాబితాను కూడా ఇచ్చాయి. ఇవి దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. వీటిలో ఉన్న చైనీస్ మొబైల్ ఫోన్లు వివరాలు ఇవి

Vivo, ఒప్పో, Xiaomi, ఒన్ ప్లస్, హానర్, రియల్ మి, ZTE, జియోనీ, ఆసుస్, infinix

గతంలో కూడా, నిఘా సంస్థలు చైనీస్ మొబైల్ ఫోన్లు మరియు అప్లికేషన్ల గురించి జాగ్రత్త చెప్పాయి. వారి సలహాను అనుసరించి, చైనాలో అభివృద్ధి చేసిన అనేక అప్లికేషన్లు సైనిక సిబ్బంది ఫోన్ల నుండి తొలగించబడ్డాయి. బలగాలు చైనీస్ మొబైల్ ఫోన్‌లు మరియు అప్లికేషన్‌లను ఉపయోగించడం కూడా నిలిపివేశాయి.

Related posts

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 72 వ‌ పుట్టిన‌ రోజు

Satyam NEWS

బద్వేల్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం

Satyam NEWS

గుడ్ వర్క్: రక్తదానం చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment