32.7 C
Hyderabad
April 27, 2024 01: 01 AM
Slider వరంగల్

మూఢ విశ్వాసాలకు ప్రజలు బలికావద్దు

#mulugupolice

మూడవిశ్వాసాల పట్ల  ప్రజలలో అవగాహన కల్పించడానికి ములుగు పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో బంజరు పల్లి గ్రామంలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ గాష్ ఆలం విచ్చేశారు. ఓ.ఎస్.డి ములుగు అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ముందుగా ఎస్పి గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు.  ప్రజల జీవన స్థితిగతులను, వారి వృత్తి ఉపాధి అక్షరాస్యత వంటి విషయాలను స్థానిక ప్రజలను, అధికారులను, గ్రామ యువత ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని దారుల వెంట నడిచి ఊరు వాస్తవ పరిస్థితులను చూసారు. అనంతరం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ మనందరం నాగరికత సమాజంలో నివసిస్తున్నామని, అర్థం లేని మూఢనమ్మకాలను ఎవరు విశ్వసించవద్దని కోరారు.

ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని తీర్చడంలో  ఎల్లవేళలా ములుగు జిల్లా పోలీస్ ముందుంటుందని దానికోసం  స్థానిక కానిస్టేబుల్స్ ఎస్సై సీఐ వంటి అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. తనను కూడా స్వయంగా కలిసి తమ సమస్యను విన్నవించుకోవచ్చునని వాటిని పరిష్కరించే బాధ్యత జిల్లా ఎస్పీ గా తానే స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు.

ఊరిలో మార్పు తీసుకురావడం నాగరిక సమాజం వైపు నడిపించే బాధ్యత యువత పై ఎక్కువగా ఉంటుందని, చదువుకున్న యువత గ్రామంలో ఒక కమిటీ గా ఏర్పడి గ్రామంలోని పెద్దలను, చదువు లేక ముఢ విశ్వాసాలు నమ్మే వారికి అవగాహనా కల్పించాలని, దానికోసం యువత  బాగా చదువుకోవాలని కోరారు. గ్రామంలోని యువత రాబోవు కాలంలో  ప్రభుత్వ అధికారులుగా ఎదగాలని దానికోసం  ఏ సహాయానికైనా  ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని చెప్పారు.

బంజరుపల్లి ఘటన తనను బాధించిందని ములుగు జిల్లా కేంద్రంలో ఉండి అన్ని రకాల ప్రభుత్వ ఆఫీస్ లు కూతవేటు దూరంలో ఉండి ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని, సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంజరుపల్లి గ్రామంలో కొంత మంది అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని వారి మొత్తం వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

వారు మార్పుచెంది చట్టపరంగా జీవించాలని, మరల చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే వారిని ఎట్టిపరిస్థిలో వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. ఇక మీద వారిపై నిఘా ఉంటుందని ఎలాంటి అసాంఘిక చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

ఇలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముఖ్యంగా యువత, ప్రజలు పోలీస్ సహాయ 100 (Dial 100)నెంబర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని వారి వ్యక్తి గత వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఓ.ఎస్.డి మాట్లాడుతూ గ్రామంలో ఎవరు మూఢనమ్మకాలను విశ్వశించవద్దని అవి కాలం చెల్లిన చట్టావ్యతిరేక చర్యలని వాటిని అవలంబించి ఇతరులకు హాని తలపెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సి.ఐ ములుగు మేకల రంజిత్  కుమార్, ఎస్.ఐ ములుగు ఓంకార్, గ్రామ పంచాయత్ సెక్రటరీ, గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఆసీస్‌.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజ‌యం

Satyam NEWS

పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment