38.2 C
Hyderabad
April 29, 2024 13: 23 PM
Slider ప్రత్యేకం

దీపావళి నాడు టపాకాయలు కాల్చడంపై నిషేధం

#DiwaliCrackers

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి టపాకాయలు అమ్మడం కాల్చడం పూర్తిగా నిషేధిస్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 9- 10వ తేదీ అర్ధ రాత్రి నుంచి 30వ తేదీ అర్ధ రాత్రి వరకూ ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలో దీపావళి టపాకాయలు కాల్చడం పూర్తిగా నిషేధం.

ఒక్క ఢిల్లీకే కాకుండా దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న అన్ని నగరాలలో ఈ నిషేధం వర్తిస్తుంది. గ్రీన్ క్రాకర్స్ వాడేవారు మాత్రం పండుగ రోజు కేవలం రెండు గంటల పాలు టపాసులు కాల్చుకోవచ్చు.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేడు ఈ ఆదేశాలు జారీ చేశారు. టపాకాయలు కాల్చడం ద్వారా వ్యాపించే కాలుష్యానికి పరిష్కారం చూపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను ఆయన నేడు విచారించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు.

టపాకాయల కారణంగా వెలువడే కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. టపాకాయలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోయి ఎంతో అనారోగ్యం పాలవుతున్నారని పిటిషన్ దారులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఒడిసా, రాజస్థాన్, సిక్కిం, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం, కోల్ కతా దీపావళి టపాకాయల అమ్మకం, కాల్చడాన్ని నిషేధించాయి.  

Related posts

నూట ముపై తొమ్మిది మానవ మృగాలను ఉరితీయాలి

Satyam NEWS

వరంగల్ లో స్వల్ప భూకంపం

Bhavani

హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ డైమండ్ జూబ్లీ వేడుకలు

Satyam NEWS

Leave a Comment