27.7 C
Hyderabad
May 14, 2024 06: 04 AM
Slider కృష్ణ

బందరు పోర్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు శ్రీకారం

th1V0IQ93M

బందరు పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూప కల్పనకు బీజం పడింది. రూ.5 వేల కోట్లలోపు వ్యయంతో నిర్వహించడానికి వీలుగా డీపిఆర్‌ను రూపొందించే బాధ్యతను జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మీద మచిలీపట్నం ఏంపీ వల్లభనేని బాలశౌరి మోపారు. పోర్టుకు భూ అవసరాలు, డ్రెడ్జింగ్‌ ప్రక్రియ, ఇతర అవసరాలు కలిపి ప్రిలిమనరీ డీవీఆర్‌ను రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతారు. ఆయన చేసే మార్పులు సూచనలతో బందరు పోర్టు నిర్మాణం పట్టాలెక్కించాలని నిర్ణయించారు. బందరు పోర్టుతో పాటు గిలకిలదిండిలో ఫిషింగ్‌ హార్బర్ కు కూడా తగిన ప్రణాళికలు రూపొందించాలని, రక్షిత మంచి నీటి పథకాన్ని రూ. 4 వేల కోట్లతో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మదింపు జరిగింది.

Related posts

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ లకు జర్నలిస్టుల సత్కారం

Satyam NEWS

వర్షాకాలం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండండి

Satyam NEWS

పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట ధర్నా

Satyam NEWS

Leave a Comment