సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర రమణ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు వరంగల్ రూరల్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరిత 6 మొక్కలను నాటారు. సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొదలు 3 మొక్కలను నాటిన తరవాత జిల్లా కలెక్టర్ హరిత మరో ముగ్గురికి ఛాలెంజ్ ని విసిరారు. వారిలో నర్సంపేట శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , cp రవీందర్ లు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని కోరారు. ఆ తరువాత భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలను నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు. వారిలో Zp చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మ రెడ్డి, జనగామ కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి ఉన్నారు.
previous post