32.2 C
Hyderabad
May 2, 2024 00: 43 AM
Slider నిజామాబాద్

తెలంగాణలో పెద్ద పండగ బతుకమ్మ: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

#mlajajula

తెలంగాణలో మహిళలు జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు.

అనంతరం బతుకమ్మ ఎత్తుకుని మహిళలతో కలిసి చెరువు వరకు వెళ్లారు. బతుకమ్మ నిమజ్జనం పూర్తయ్యే వరకు గ్రామస్థులతో కలిసి ఉన్నారు. దాంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. పండగ నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలను పండగ కానుకగా అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందన్నారు.

Related posts

కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను చంపిన భార్య

Bhavani

సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దినం.. పార్టీ సేవా కార్య‌క్ర‌మాలు

Sub Editor

తెలుగు సినిమాకు స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజు

Satyam NEWS

Leave a Comment