33.7 C
Hyderabad
April 28, 2024 00: 47 AM
Slider ప్రత్యేకం

జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ కెసిఆర్ సైకత శిల్పం

#kcrsandart

పూరిలో ఏర్పాటు చేయించిన ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్

దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు కొలువుతీరిన పూరీ పవిత్ర నగరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందింపజేశారు.

14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం తెలంగాణను దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్తా కలిగిన మహోన్నత నేత కెసిఆర్ అని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఇప్పటికీ రైతులు ఇతర వర్గాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే కాంగ్రెస్ బిజెపిల పాలన వైఫల్యమైననని గుర్తించిన కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడ్డారని అన్నారు.

యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశ గతిని సైతం మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అద్భుతంగా తీర్చిదిన శిల్పాన్ని వీక్షించేందుకు పూరీలోని స్థానికులు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు నాయకుడు అంటూ ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాలలో పోస్ట్లు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అరవింద్ అన్నారు.

Related posts

తెలంగాణ సూఫీ తాత్వికతకు ప్రతిష్టాత్మక అవార్డు

Satyam NEWS

సుప్రీమ్ కోర్ట్:పౌరసత్వసవరణచట్టంపై కేరళప్రభుత్వం సవాల్

Satyam NEWS

30వేల మందికి పైగా గాంధీ చిత్ర వీక్షణ

Bhavani

Leave a Comment