38.2 C
Hyderabad
May 2, 2024 19: 33 PM
Slider విజయనగరం

సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దినం.. పార్టీ సేవా కార్య‌క్ర‌మాలు

ys Jagan Birth day

సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ నెల 20, 21 తేదీల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేపట్ట నుంది. వైఎస్ఆర్సీపీ.ఇదే విష‌యాన్నిపార్టీ ఉత్త‌రాంధ్ర క‌న్వీన‌ర్, విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి నివాసంలో పార్టీ నేత‌లు తెలిపారు.

ఈ మేర‌కు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆ పార్టీ నేత‌లు ‌వైఎస్పార్సీపీ బ్ల‌డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ కన్వీనర్ రెడ్డి బంగారు నాయుడు, బ్లడ్ బ్యాంకు కోకన్వీనర్ జి. ఈశ్వర్ కౌశిక్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, బ్లడ్ బ్యాంక్ కో కన్వీనర్ అల్లు చాణక్యలు తెలిపారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు, పార్టీ నేత‌ల ప్రోత్సాహంతో యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్నకంటోన్మెంట్ పార్టీ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ఈ రక్తదాన శిబిరాన్నిపార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. కరోనా కష్టకాలంలో రక్త నిల్వలు లేకపోవడంవల్ల అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా, బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగులు రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడ్డార‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

21వ తేదీన ఆయా డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మీడియా స‌మావేశంలో యువజన విద్యార్థి విభాగాల నాయకులు బోడ సింగ్ ఈశ్వర రావు, జి వి రంగారావు, బండారు ఆనంద్, ఆవాల రోహిణి కుమార్ యాదవ్, కొయ్యాన జగదీష్, నెల పర్తి రాజ్కుమార్, బోనెల తరుణ్, సోము అశోక్, బూడి అప్పలరాజు, పీతల శ్రీను, సప్పా ప్రసాద్, రజిని కుమార్, పొంత పల్లి మురళి, ప్రసన్న, అమర అయ్యప్ప, మనోజ్, రాము, సాయి, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

బాలు ఆత్మ శాంతించాలంటే?

Satyam NEWS

హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో సాంకేతిక విద్యా శాఖ అవగాహన

Bhavani

అయ్యగారు ఫుల్ బిజీ ఆయన చెబితే కానీ పని జరగదు

Satyam NEWS

Leave a Comment