27.7 C
Hyderabad
April 26, 2024 05: 34 AM
Slider నిజామాబాద్

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

#KamareddyCollector

ప్రకృతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మ పేర్చి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివృద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించారన్నారు. గ్రామాభివృద్ధికి రెండు లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

ఆడపడుచులకు, ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. బతుకమ్మలను పెద్దగా పేర్చిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. దాతలకు సన్మానం చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ ధనలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు దేవేందర్, ఎంపీపీ గరీబునీషా బేగం, జెడ్పిటిసి సభ్యురాలు శ్రీలత, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, తహసిల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన సాయి కల్యాణి

Bhavani

విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మేసే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

Satyam NEWS

Leave a Comment