29.7 C
Hyderabad
April 29, 2024 07: 30 AM
Slider వరంగల్

పేదింటి అడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్ సారె

#BatukammaSarees2

పేదింటి అడబిడ్డలకు పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన సద్దుల బతుకమ్మ సారె ఈ బతుకమ్మ చీరలు అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్ అన్నారు.

బతుకమ్మ ను ఎలా అయితే తీరొక్క పూలతో పేరుస్తామో అదేవిధంగా తీరొక్క రంగులతో సిరిసిల్ల నేతన్న లచే తయారు చేసిన ఈ చీరలు ఉన్నాయని ఆమె అన్నారు.

ములుగు జిల్లా లోని జంగలపల్లీ గ్రామ సర్పంచ్ అనిత అధ్వర్యంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్ చీరల పంపిణీ చేశారు. గత పాలకులు బతుకమ్మ పండుగ ను పట్టించుకోలేదు.

కల్వకుంట్ల కవిత జాగృతి ద్వారా బతుకమ్మ ని విశ్వ వ్యాప్తం ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగ కానుకగా బతుకమ్మ చిరలతో సంబురాలు చేసుకోవాలని పంపించారు.

ఈ బతుకమ్మ చీరలు ఒక్క హిందువులకే కాదు అన్ని మతాల వారికి అందిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సర్వ మతలకి కులాలకు ప్రతీక.

కావున ప్రతి ఒక్క ఆడబిడ్డ మన అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జెడ్పీటీసీ సకినాల భవాని, జెడ్పీ కో ఆప్షన్ మెంబెర్ రియాజ్,

తెరాస జిల్లా నాయకులు గండ్ర కోట సుధీర్, వినయ్ కుమార్, తెరాస యువజన జిల్లా నాయకులు మంద ప్రదీప్, బొంతల వేణు, శ్రీపతి, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రనికి రానున్న బన్సల్

Bhavani

వ్యయంపైనే అనుమానాలు

Murali Krishna

ఓయూలో విద్యార్థుల అందోళన

Bhavani

Leave a Comment