32.2 C
Hyderabad
May 8, 2024 13: 06 PM
Slider ఖమ్మం

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

#bcmpolice

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా భద్రాచలం పట్టణంలోని డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి తమ వివరాలను తెలియజేస్తే, నేరస్తుల వివరాలను కనిపెట్టవచ్చని తెలియజేసారు. యువత ఇంటర్నెట్ వినియోగం, దాని వలన కలిగే కొన్ని దుష్పరిణామాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు,ఆన్లైన్ మోసాలు వంటి వాటి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ కామేశ్వరరావు, అధ్యాపకులు వీరన్న, భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి పాల్గొన్నారు.

Related posts

అక్టోబర్ 2నుండి మలివిడత జోడో యాత్ర..?

Bhavani

రాజుల కోట‌లో వేరు కుంప‌టి…త‌గ్గ‌నున్న రాజాగారి హవా!

Satyam NEWS

క్లీన్ అండ్ గ్రీన్ పై గోల్నాక డివిజన్ లో సమీక్ష

Satyam NEWS

Leave a Comment