33.7 C
Hyderabad
April 28, 2024 23: 02 PM
Slider ఖమ్మం

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

#khammamdc

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యమే కాక, అట్టి యూనిట్లతో దళితులు ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా అధికారులు పర్యవేక్షణ, మార్గదర్శకం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో చింతకాని మండలంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్, నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన చింతకాని మండలంలో వందశాతం యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టామన్నారు. 3456 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటికి 2195 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు, 514 యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. లుంపి స్కిన్ వ్యాధి వల్ల పశువుల రవాణాపై నిషేధం ఉన్నందున డెయిరీ యూనిట్లు ఆలస్యం అవుతున్నట్లు, టీకాలు వంద శాతం పూర్తయిన పిదప రవాణాపై నిషేధం తొలగిస్తారని ఆయన అన్నారు. వెండర్ చెల్లింపులు వంద శాతం చేసినట్లు ఆయన తెలిపారు.

రవాణా వాహనాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గొర్రెల యూనిట్లను 5 నవంబర్ కల్లా వంద శాతం గ్రౌండింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్ పైనే కాక, వాటి నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మంజూరు యూనిట్లన్నీ విజయవంతంగా నడిచేట్లు అధికారులు లబ్ధిదారులకు సూచనలు ఇస్తూ, పర్యవేక్షణ చేయాలన్నారు. యూనిట్లన్నీ లబ్ధిదారులే నడిపేటట్లు చూడాలని, కాంట్రాక్ట్ కి ఇవ్వడం, లాంగ్ లీజ్ కి ఇవ్వడం చేయకుండా చూడాలని, ఇతర ప్రదేశాలకు పనులపై వెళ్లే యూనిట్లతో లబ్ధిదారులు ఖచ్చితంగా వెళ్లేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు.

కిరాణా, రెడీమేడ్  తదితర యూనిట్లను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ, అకౌంట్ నిర్వహణ చేసేలా, వ్యాపారంపై వారికి అవగాహన కలిగేలా చర్యలు చేపట్టాలని, స్టాక్ తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. మంజూరు యూనిట్లన్నీ ఖాళీగా ఉండకుండా, నిర్వహణలో ఉండాలని ఇందుకై అధికారులు వారికి దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు. దళితబంధు పథకం తో దళితుల బ్రతుకులు మారాలని, ఈ దిశగా అధికారులు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ అన్నారు. సమీక్ష లో యూనిట్ల వారిగా నిర్వహణ, లబ్ధిదారుల సమస్యలు గురించి ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Related posts

విద్యార్ధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్టు

Bhavani

ఘనంగా బిపి మండల్ 102 వ జయంతి వేడుకలు

Satyam NEWS

అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబురాలు

Satyam NEWS

Leave a Comment