29.7 C
Hyderabad
April 29, 2024 07: 27 AM
Slider విజయనగరం

రాజుల కోట‌లో వేరు కుంప‌టి…త‌గ్గ‌నున్న రాజాగారి హవా!

#VijayanagaramTDP

ఏపీలో ఒక‌ప్పుడు ఉత్త‌రాంద్ర అంటే…టీడీపీకి పెట్ట‌ని కోట‌. ఎంద‌రో నేత‌ల‌ను మండ‌ల స్థాయి నుంచీ రాష్ట్ర మంత్రి వ‌ర‌కు క‌ట్ట‌బెట్టింది ఉత్త‌రాంధ్ర టీడీపీ‌. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ గద్దెనెక్కిన ద‌గ్గర నుంచీ అప్ర‌తిహ‌తంగా ఉత్త‌రాంధ్ర వాసుల‌కు ఎన్నో ప‌దువుల‌ను క‌ట్ట‌బెట్టింది..ఆ పార్టీ.

అటువంటి ప‌చ్చ పార్టీకి గడ్డు రోజులు వ‌చ్చాయా..? అంటే అవున‌నే అంటున్నారు..కొంద‌రు నేత‌లు. ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్ విభ‌జన అనంత‌రం..13 జిల్లాలతో ఏర్ప‌డ్డ‌.. ఏపీ రాష్ట్రానికి మొదట్లో అంటే 2014లో టీడీపీకి ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టినా 2019 ఎన్నిక‌ల‌లో పూర్తిగా ఆ పార్టీని దూరంపెట్టి…అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి ప‌ట్టంక‌ట్టారు.

ఈ పరిణామ క్రమంలోనే ఉత్త‌రాంద్ర‌లో టీడీపీ బాగా దెబ్బ‌తింది. అయితే కేంద్రంలో రెండోసారి కూడా  మోడీనే అధికారం లోకి రావ‌డం..అందునా అత్య‌థిక స్థానాలు క‌లిగిన యూపీలో కూడా మోడీ అనుంగ శిష్యుడు సీఎం పీఠాన్ని అధిరోహించ‌డంతో ఉత్త‌రాదిలో బీజేపీకి ఇక ఎదురు చూడ‌న‌వ‌స‌రం లేకుండా ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఇక క‌మ‌ల నాధులు..దక్షిణాదివైపు అందునా త‌మిళ‌నాడు,ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌పై దృష్టి సారించారు. అందులోభాగంగా ఉత్త‌రాంద్ర‌కు చెందిన‌ టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌ను త‌మ పార్టీవైపు తిప్పుకునే య‌త్నానికి దిగింది. అందులో  భాగంగా ఇటీవ‌లే  ఎన్టీఆర్ హాయం నుంచీ టీడీపీని అంటి పెట్టుకున్న గ‌ద్దె బాబూరావును పార్టీలోకి లాగారు…క‌మ‌లనాథులు.

అ త‌ర్వాత ఆ పార్టీకి చెందిన ఒక్కో సీనియ‌ర్ నేత‌పై గురి పెట్టారు..క‌మ‌ల‌నాథులు. దీంతో కిమిడి క‌ళావెంక‌ట్రావు, ప‌డాల అరుణ‌, తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ఏడాది క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని అందులోని విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ క‌నుచూపు మేర అయినా ప‌ట్టు సాధించ‌లేక మూల‌న ప‌డిన‌ట్ట‌యింది.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ బంగ్లానే టీడీపీ కార్యాల‌యంగా ఉంటూ వ‌స్తోంది. ఆ ప‌రిస్థితిని మార్పు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, పార్టీ మ‌హిళా నేత మీసాల గీత  కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే అశోక్ బంగ్లాను పార్టీ కార్యాల‌యంగా కాకుండా..కొండ‌ప‌ల్లి పైడిత‌ల్లి నాయుడు కొడుకు  ఇంటిని పార్టీ కార్యాల‌యంగా మార్చ‌డ‌మే కాకుండా ఏకంగా జిల్లా పార్టీ నేత‌లంద‌ర్నీ పిలిచి స‌మావేశం నిర్వ‌హించ‌డం కొస‌మెరుపు.

మ‌రి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అదీ అశోక్ బంగ్లా త‌ప్పించి జిల్లా కార్యాల‌యాన్ని వేరేక చోటికి మార్చ‌డం  వెన‌క‌…ఆంతర్యం ఏంటీ…?  కేంద్ర మాజీ మంత్రి క‌మ‌ల గూటికి  చేరుకోనున్నారా…అన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో…?

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

నెల్లూరు రంగనాయకల పేట లో ఉగాది ఉత్సవాలు

Satyam NEWS

దివ్య దీపోత్సవం!

Satyam NEWS

అన్నదాన కార్యక్రమం చేపట్టిన మున్నూరు కాపు సంఘాలు

Satyam NEWS

Leave a Comment