42.2 C
Hyderabad
April 30, 2024 17: 51 PM
Slider ముఖ్యంశాలు

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

#ntr

ఖమ్మం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.

ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా విగ్రహ ఆవిష్కరణ మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఒక్కసారైనా వచ్చి ఆయన విగ్రహాన్ని దర్శించుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయిందని విగ్రహ తరలింపుకు రంగం సిద్ధం చేశామని మే 28న పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు.

Related posts

ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Satyam NEWS

తిరుపతి గంగమ్మ రాజకీయాల్లోకి వచ్చిందా?

Satyam NEWS

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS

Leave a Comment