28.2 C
Hyderabad
May 8, 2024 23: 10 PM
Slider ఖమ్మం

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం  జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు.  జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక గదులు, ఆరోగ్యశ్రీ వార్డు, ఏఎంసి వార్డు పునర్నిర్మాణం, మైనర్ ఓటి ఏర్పాటు, టాయిలెట్ బ్లాకుల మరమ్మతులు, పాత బ్లాకు రూఫ్ లీకేజీల మరమ్మత్తులు, వివిధ విభాగాల అభివృద్ధి విషయమై చర్యల గురించి చర్చించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల ద్వారా అందుతున్న సేవలు గురించి ఆయా విభాగాల వారిని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా  చైర్మన్ మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సిబ్బంది మెరుగ్గా పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఎంసిహెచ్ భవనం పై అంతస్తు మంజూరు కొరకు మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.క్యాథలాబ్ ద్వారా 15 ఏంజియో ప్లాస్టీ, 50 ఏంజియోగ్రామ్, 357 ఆరోగ్యశ్రీ కేసులు చేపట్టారన్నారు. వెల్ నెస్, ఆయుష్ కేంద్రాలకు భవన నిర్మాణానికి ఆసుపత్రి అవసరాలకు పోను మిగులు స్థలం ఉంటే కేటాయింపు చేయాలన్నారు. ఐపి, ఓపి జనరల్ విభాగంలో మాన్యువల్ గా జరుగుతున్నట్లు, ఆన్లైన్ లో చేపట్టేలా చూడాలన్నారు.

 సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినట్లు, అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే ఆకాడమిక్ సంవత్సరం నుండి వైద్య కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు, పేదవారికి ఇది మంచి అవకాశమని అన్నారు. ప్రజల ఆరోగ్య విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కృషి చేస్తున్నట్లు, ఇది భవిష్యత్తులో కొనసాగాలన్నారు. వైద్య రంగంలో దేశానికి రోల్ మోడల్ గా ఖమ్మం ఆసుపత్రి కావాలన్నారు. ఆసుపత్రికి ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు.    

సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రధాన ఆసుపత్రిలోని క్యాథలాబ్ లో హృద్రోగులకు స్టెంట్ లు అమరిస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని, పేద ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులకు పోయి, ఆర్థికంగా నష్ట పోకుండా చూడాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధ పడాలన్నారు.  అన్ని రకాల విభాగాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో ఏవో డా. రాజశేఖర్ గౌడ్, డా. రామునాయక్, డా. అమర్ సింగ్, డా. కృపా ఉషశ్రీ, డా. సీతారాం, డా. చైతన్య, వివిధ విభాగాల హెచ్ఓడిలు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

స్పంద‌న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

Satyam NEWS

మాదలలో రూ.30.30 కోట్ల సంక్షేమ సిరులు

Bhavani

కమలనాథులకు షాక్ ఇచ్చిన ‘జన’ శ్రేణులు

Satyam NEWS

Leave a Comment