శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ విద్యా గణేశానంద భారతి స్వామీజీ నేడు దర్శించుకున్నారు. శ్రీ విద్యా గణేశ సంస్థానం భాగ్యనగర్ కు చెందిన వీరికి హిందు దేవాలయాల సాంప్రదాయ ప్రకారం ఆలయ Eo వినోద్ రెడ్డి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో ఆలయ స్థానాచార్యులు, ఆలయ పూజారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గారు భక్తులకు ప్రసాదాన్ని అందచేశారు.