33.7 C
Hyderabad
April 27, 2024 23: 11 PM
Slider రంగారెడ్డి

మేడ్చల్ లో ‘ భరోసా ‘ కేంద్రంను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి

#dgpmehendarreddy

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ పోలీస్ క్వార్టర్స్ వద్ద  నూతనంగా నిర్మించిన షీ టీమ్స్ ‘భరోసా’ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ WSW ఏడీజీ స్వాతి లక్రా,  సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టర్ హరీశ్, బాలానగర్ డీసీపీ సందీప్, సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవితతో కలిసి ప్రారంభించారు. మేడ్చల్ కేంద్రంగా బాలానగర్ జోన్ పరిధి లోని శామీర్ పేట్, జగథ్గిరిగుట్ట, మేడ్చల్, ఆల్వాల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్ తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ భరోసా కేంద్రం సేవలందించనున్నది.

అత్యాచారానికి గురైన మహిళలు, చిన్నారులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం అండగా నిలుస్తున్నాయన్నారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధితులు అత్యాచారాలకు గురైన మహిళలను అక్కున చేర్చుకుని వారికి న్యాయ సహాయం చేయడం, వైద్య పరీక్షలు, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో  భరోసా సెంటర్లు పని చేస్తున్నాయి.

ఇందులో భాగంగా ఈరోజు బాలానగర్ డీసీపీ జోన్ పరిధిలోని మేడ్చల్లో 3వ భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఒక ఎస్సైతో పాటు ఆరు విభాగాలు బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాయి. సెంటర్ హెడ్, వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, రిసెప్షనిస్టు, ఆకౌంటెంట్ తదితల విభాగాలు ఉంటాయి.

బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారు. లీగల్, మెడికల్ , చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను వేర్వేరుగా కేటాయించారు. సెక్షన్ల ప్రకారం బాధితుల కేంద్రంలో నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ భరోసా సెంటర్ ఏర్పాటుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుమారు రూ. 1 కోటి డొనేట్ చేసిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు సైబరాబాద్ పరిధిలో మరొక భరోసా సెంటర్ ను మేడ్చల్లో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల జరిగినప్పుడు వారికి న్యాయం జరిగే క్రమంలో వారు ఎంతో మనోవేదనకు గురవుతారన్నారు. ఇవన్నీ సమస్యలను ఎదుర్కోలేక బాధితులు న్యాయ వ్యవస్థకు దూరంగా ఉంటారన్నారు. ఈ భరోసా సెంటర్లు  లైంగిక దాడి బాధితులకు ఆత్మబంధువులా ఉంటూ వారికి సాయం చేసే వారందరినీ ఒకే గొడుగు కిందికి చేర్చి బాధితులకు ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలను అందజేస్తారన్నారు.

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ SOP, బాధితులకు పరిహారం ఇప్పించేవరకూ భరోసా సెంటర్ సాయపడుతుందన్నారు. పోలీస్ స్టేషన్, హాస్పిటల్, ఎమోషనల్ సపోర్ట్ కోసం సైకాలజిస్ట్ ల వంటి అన్ని సౌకర్యాలు ఒకేచోట లభిస్తాయన్నారు. అంతేకాకుండా ఈ భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి, వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడతాయన్నారు. బాధితులు కోర్టుకు వెళ్లకుండానే వీడియో స్టేట్మెంట్ లు ఇచ్చే వీలును భరోసా సెంటర్లు కల్పిస్తాయన్నారు. బాధితులకు కేవలం ఒక ఫోన్ కాల్ చేరువలో భరోసా సెంటర్ ఉందనే ధైర్యం రావాలన్నారు.

ఈ భరోసా సెంటర్లను జిల్లాల్లో సంబంధిత ఎస్పీలు కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అలాగే రాష్ట్ర స్థాయి లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ వారు పర్యవేక్షిస్తారన్నారు. అనంతరం డీజీపీ (మహిళా భద్రత) స్వాతి లక్రా మాట్లాడుతూ 2016 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక భరోసా సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. లైంగిక దాడి బాధితుల సహాయం కోసం ఈ భరోసా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11 భరోసా  సెంటర్లు ఉన్నాయన్నారు. మేడ్చల్లో ఈరోజు ప్రారంభించినది 12వ భరోసా సెంటర్ అన్నారు. సాధారణంగా లైంగిక దాడి జరిగిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మెజిస్ట్రేట్ ముందు 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక మహిళా పోలీసు అధికారి సమక్షంలో 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

భరోసా సెంటర్ లో బాధితులకు సహాయం చేసేందుకు ఒక సైకాలజిస్ట్ హెడ్, వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, రిసెప్షనిస్టు, ఆకౌంటెంట్  ఇతర అధికారులు ఉంటారు. ఇవన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ భరోసా సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 భరోసా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. భరోసా సెంటర్ లో పని చేసే వారందరికీ బెంగళూరులోని NIMHANS లో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.

గతంలో లైంగిక బాధితుల నుంచి 15 నుంచి 25 శాతం వరకు కన్విక్షన్లు వచ్చేవి, అయితే భరోసా సెంటర్ల ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 60 శాతం వరకూ కన్విక్షన్లు వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ పరిధిలో మరో రెండు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులకు ఉపశమనం మరియు పునరావాసంతో పాటు పోలీసులు, వైద్య మరియు న్యాయ నిపుణుల ద్వారా కేంద్రం రహస్య సహాయాన్ని అందిస్తుందని వివరించిన

లక్రా, భరోసా కేంద్రాలు త్వరలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా POCSO (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) కోర్టు సేవలను నిర్వహిస్తాయని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది బృందాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ “మహిళలు మరియు పిల్లల భద్రత మరియు శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలోని అల్వాల్ కొండాపూర్ లో భరోసా సెంటర్లు ఉన్నాయి అన్నారు. మేడ్చల్ లో ఏర్పాటుచేసిన భరోసా సెంటర్ తో సైబరాబాద్ పరిధిలో మొత్తం మూడు భరోసా భరోసా సెంటర్ ఉన్నాయన్నారు. సేఫ్టీ మేనేజ్మెంట్ లో భాగంగా గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి గాఋ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ చేస్తారన్నారు. ఈ భరోసా సెంటర్ ను మానవతా దృక్పథంతో సేవలు అందిస్తారన్నారు.

Gail జోనల్ జనరల్ మేనేజర్ శరత్ కుమార్ మాట్లాడుతూ ఈ విధమైన భరోసా సెంటర్ లు దేశంలో  ఎక్కడా లేవన్నారు. సమాజ హితం కోసం తమను ఎంతో మంచి కార్యక్రమం లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నూ పోలీసులతో కలిసి పని చేస్తామన్నారు.

భాగ్యనగర్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎండీ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ ఈ భరోసా సెంటర్లో ఏర్పాటులో తాము భాగస్వాములం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భరోసా బాధితుల ఇంటి గుమ్మం ముందు న్యాయం అందుతుందన్నారు.

Related posts

మానవ అక్రమ రవాణా కేసులో వైసీపీ అగ్రనాయకుడి అరెస్టు

Satyam NEWS

వడదెబ్బ తగులుతుంది అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు

Satyam NEWS

Leave a Comment