31.2 C
Hyderabad
May 2, 2024 23: 12 PM
Slider ప్రత్యేకం

మానవ అక్రమ రవాణా కేసులో వైసీపీ అగ్రనాయకుడి అరెస్టు

#sattaru

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళానాయకురాలు దొంగ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా నడుపుతూ కర్నాటక పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్తారు వెంకటేష్ రెడ్డి మనుషుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి అరెస్టు అయ్యాడు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్టు చేయడం ఇక్కడి పార్టీ నేతల్లో చర్చనీయాంశం అయింది.

ఇరవై ఏళ్ల ఒక యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకువచ్చి అతను ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో అతడిని కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడని ఆస్పత్రికి తరలించారు.

సెయింట్ చార్లెస్ కౌంటిలోని ఓ ఇంట్లో యువకుడ్ని హింహిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వాళ్లు పోలీసుల్ని లోపలికి మొదట అనుమతించలేదు. తర్వాత పోలీసులు బలవంతంగా వెళ్లి చూడటంతో ఓ యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు తెలుగు యువకుల్ని అరెస్టు చేశారు. పెనుమచ్చ శ్రబన్, పెన్మత్స నిఖిల్ అనే వారిని అరెస్టు చేశారు. బాధితుడ్ని హింసిస్తున్న అసలు వ్యక్తి సత్తారు వెంకటేష్ రెడ్డి అని గుర్తించి అతడ్ని వేరే ఇంట్లో అరెస్టు చేశారు.

ముగ్గుర్నీ జైలుకు తరలించారు. బాధిత యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి వెట్టి చారికి చేయిస్తున్నాడు సత్తారు వెంకటేష్ రెడ్డి. అన్ని రకాల పనులను చేయించుకునేవాడు. మూడుగంటల కన్నా ఎక్కువ నిద్రపోనిచ్చేవాడు కాదు. సరైన తిండి పెట్టేవాడు కాదు. కటిక నేత మీద పడుకోమని చెప్పేవాడు. తనపై ఎప్పుడూ సీసీ కెమెరా నిఘా పెట్టి ప్రతి పనిలోనూ తప్పును వెదికి దండించేవాడు. అయితే ఆ యువకుడికి అమెరికాలో ఎవరూ తెలియదు. చివరికి ఓ పొరుగు వ్యక్తి పరిస్థితిని గమనించాడు. ఏమైనా సాయం కావాలంటే చెప్పాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

తనను ఇలా హింహిస్తున్నారని చెప్పడంతో ఆ పొరుగు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితుడ్ని కాపాడారు. నిందితులు ముగ్గుర్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు , బానిసత్వం చేయించుకునేందుకు అక్రమ రవణా, దాడిచేయడం, కిడ్నాప్ చేయడం, గృహ హింస, క్రిమినల్ చర్య వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి జైల్లో వేశారు. వెంకటేష్ రెడ్డి తనను తాను చాలా పవర్ ఫుల్ అని అమెరికాలోనూ దందాలు చేస్తూంటారు. ఆయన తాను వైసీపీలో కీలక నేత అని చెబుతుంటాడు. వైసీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్న వీడియోలను తన వెబ్ సైట్ లో పెట్టుకున్నారు.

Related posts

మహేష్ బాబు ఎంకరేజ్ మెంట్ వల్లే ‘మేజర్’

Satyam NEWS

కడప లో బయల్పడ్డ భూ గర్భ కారాగారం…

Satyam NEWS

టాస్క్ ఫోర్స్‌ ఎస్పీగా  చక్రవర్తి

Murali Krishna

Leave a Comment