31.7 C
Hyderabad
May 2, 2024 08: 43 AM
Slider కడప

డబ్బులు మీరు పంపి మాపై నెడితే ఏం చేయాలి?

Bhatyala tour 08

అధికార పార్టీ డబ్బులు పంచి ఆ నిందను తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అందువల్ల ఎన్నికల కమిషన్ దీన్ని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటన్నదో చెప్పాలని కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి భత్యాల చెంగలరాయుడు డిమాండ్ చేశారు.

వీరబల్లి మండలం మట్లి గ్రామంలో ఆదివారంనాడు పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తరపున తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమేనని ఎన్నికల సమయంలో ముఖ్యంగా తాము మూడు విషయాల పై ఎలక్షన్ కమీషన్ వారికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

డబ్బులు పంచినట్లు తెలిస్తే గెలిచిన తర్వాత అయినా డిస్ క్వాలిఫై చేస్తానని చెప్పారని, మూడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేస్తామని చెప్తున్నారని ఆయన అన్నారు. మీరే డబ్బులు మద్యం పంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంచారని చెప్పి వారిని ఇబ్బంది పెట్టరని గ్యారెంటీ ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

మద్యం షాపులను నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి అమ్మనివ్వకుండా సీజ్ చేయాలని, మద్యం ఫ్యాక్టరీలను కూడా ఎన్నికలు అయిపోయి రిజల్ట్ తర్వాత రెండు రోజుల వరకు తయారు చేయకుండా, షాపులలో అమ్మనివ్వకుండా చేయాలని కోరారు.

దాన్ని అతిక్రమించితే మద్యం ఎప్పుడు రెడీ చేశారు అనే డేట్ ఉంటుంది కాబట్టి దానిని బట్టి కనుక్కోవచ్చునని అన్నారు. అలాగే వాలంటీర్లను కూడా వైసీపీ వారు వినియోగించుకుంటారని, అలా జరగకుండా ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుండి ఫలితాలు వచ్చే రోజు వరకు వారికి ఏ పని కల్పించకుండా ఒక ఓటరు లాగా చూడమని భత్యాల  కోరారు.

 ఎన్నికలలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రాజు, మాజీ అడా చైర్మన్ హరిప్రసాద్, మాజీ జిల్లా ట్రెజరీ అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు, పోతురాజు నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఇంకా ఎల్ జి రమేష్ రాజు, చలపతి నాయుడు, రాంచంద్రయ్య, చంద్రారెడ్డి, రామచంద్రా రెడ్డి, సిద్దిరాజు, నాగభూషణం, రెడ్డయ్య రాజు, నేతి రమేష్ నాయుడు, రమణయ్య, భాస్కర్ రాజు, సుధాకర్ రాజు, ఆంజనేయులు, చంద్రశేఖర్, సురేష్, వెంకటసుబ్బారెడ్డి, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్పై ఒబామా:వైరల్‌గా మారిన ట్రంప్ ట్విట్టర్ పోస్టింగ్

Satyam NEWS

మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమం పాటించాలి

Satyam NEWS

సీఎం జగన్ పర్యటనకు 900 మంది తో పటిష్టమైన బందోబస్తు

Satyam NEWS

Leave a Comment