40.2 C
Hyderabad
April 28, 2024 15: 54 PM
Slider మహబూబ్ నగర్

ఎడ్వయిజ్: హోలీ పండుగలో చైనా కలర్స్ వాడవద్దు

kollapur CI

ప్రజలు హోలీ పండుగ వేడుకలలో  చైనా కలర్స్ వినియోగించక పోవడం ఆరోగ్యానికి మంచిదని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం సిఐ బి.వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. హోలీ పండుగను ప్రజలు శాంతి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా  కులాల, మతాలకు అతీతంగా సంతోష వాతావరణంలో హోలీ పండుగ వేడుకలను జరుపుకోవాలని తెలియచేశారు.

అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి అందరికి తెలిసిందేనన్నారు. అందుకోసం చైనాలో తయారు అయిన వస్తువులను ప్రజలు వినియోగించకూడదని చెప్పారు. కరోనా వైరస్ అక్కడ నుండే వ్యాపించింది కాబట్టి చైనా కలర్స్ ను వినియోగించక పోవడం ఉత్తమమ్మన్నారు.

స్వచ్ఛమైన ప్రకృతి నుండి వచ్చే మోదుగ వసంతాల పరమ లాలు, పసుపు, కుంకుమలను హోలీ రంగులుగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి  మంచిదన్నారు.  అదేవిధంగా హోలీ కేళి అనంతరం ప్రజలు ముఖ్యంగా యువత బావుల వద్ద, కొల్లాపూర్ సరిహద్దు కృష్ణా నదీ తీరాలలో  జాగ్రత్తగా ఉండాలని  చెప్పారు.

ఈత రాని వారు నది, బావులకు దగ్గరకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. ముందుగా కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు  సిఐ బి.వెంకట్ రెడ్డి హోలీ పండుగ  శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ధాన్యం సేకరణ పూర్తి చేయాలి

Satyam NEWS

యూనియన్ బ్యాంకు బంగారం మాయం: ఖాతాదారుల ఆందోళన

Bhavani

ప్రజా సేవలో ఆకాశం ఎత్తుకు వెళ్లిన సాయి సుధ

Satyam NEWS

Leave a Comment