39.2 C
Hyderabad
May 3, 2024 11: 22 AM
Slider కడప

పనికి రాని జీవోలు విడుదల చేస్తున్న జగన్ ప్రభుత్వం

bhatyala 06

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని జీవోలు రోజుకు ఐదు లేక ఆరు విడుదల చేస్తున్నదని కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. ఇంటి పట్టాల కోసం కాలిబాటలు, గుట్టలు, స్మశానవాటికలు చదును చేసి ఇచ్చేస్తున్నారని ఆయన అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం 5లక్షల ఇల్లులు కట్టిందని అయితే వాటిని ఇంకా ప్రజలకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన అన్నారు. రెడీగా ఉన్న వాటిని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు పనికి రాని భూములను పట్టాలుగా ఇస్తున్నారని ఆయన అన్నారు.

గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న ప్రదేశాలల్లో కూడా ఇంటి పట్టాలను ఇవ్వమని జీవో జారీ చేసారని బత్యాల  తెలిపారు. నేను కూడా రైల్వేకోడూరు బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో 500 వందల ఇంటి పట్టాలని ఇప్పించానని కానీ 200మంది మాత్రమే ఇండ్లను నిర్మించుకున్నారని ఇంకా 300 వందల మంది ఊరికి దూరమని ఇండ్లను కట్టుకోలేదని ఆయన అన్నారు.

ఇప్పుడు రాజంపేటలో ఊరికి దూరంగా అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొండలు, గుట్టలు లక్షలు ఖర్చు చేసి చదును చేస్తున్నారని, వాటిని చదును చేయడం వల్ల మేపు(గడ్డి)లేక మూగ జీవులు అల్లాడి పోతున్నాయని ఆయన అన్నారు. అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నవాటిని తీసుకొని పట్టాలు ఇచ్చుకోమని, వారు 25 లక్షల ఇంటి పట్టాలను ఇవ్వాలనుకున్న దానిని మేము తప్పుపట్టడం లేదు కానీ అలా కొండలను,గుట్టలను చదును చేసి మూగజీవుల కడుపు కొట్టదని అన్నారు.

ఈ సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, పట్టణ అధ్యక్షుడు సంజీవరావు, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, మాజీ కౌంస్లర్స్ మనుబోలు వెంకటేశ్వర్లు, ఇడిమడకల కుమార్, గుగిళ్ళ చంద్రమౌళి, మన్నూరు రాజ, కరిముల్లా, కొండా శ్రీనివాసులు, రాంనగర్ నరసింహ, మందా శ్రీనివాసులు, కొల్లి రెడ్డయ్య నాయుడు, తిరుపాల్, పీరు, మండపంపల్లి కిరణ్ స్వామి, పాండురాజు, సుబ్బు, టి.యన్.యస్.ఎఫ్. పోలి శివకుమార్, వెంకటసుబ్బయ్య, శివయ్య, శేఖర్, తాళ్ళపాక సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి రైతు సదస్సులో పాల్గొన్న విజయశాంతి

Satyam NEWS

మిషన్ కల్లాలి సెట్లురులో శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

కుట్టుమిషన్లు అందించిన వరల్డ్ ఆర్య వైశ్య మహిళా విభాగం

Satyam NEWS

Leave a Comment