30.7 C
Hyderabad
April 29, 2024 04: 46 AM
Slider విశాఖపట్నం

విశాఖపట్నం రేంజ్ డీఐజికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ దీపికా దంపతులు

#vizagrangedig

విశాఖ రేంజ్ డీఐజీకి…ఐజీ గా పదోన్నతి వరించింది. ఈ మేరకు ఎల్.కే.వి.రంగారావు ను…విశాఖ రేంజ్ పోలీసు కార్యాలయంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్. మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఇన్స్పెక్టరు జనరల్ గా ఉద్యోగోన్నతి పొందిన  రంగారావు ను అభినందించారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛాలను అందించి, శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లాలో పని చేస్తున్న అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, దిశ డిఎస్పీ టి. త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు ఇన్స్ పెక్టరు జనరల్ గా ఉద్యోగోన్నతి పొందిన ఎల్. కే.వి.రంగారావుకు అభినందనలు తెలిపి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

విద్యార్ధులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

Satyam NEWS

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

బామ్మగారి బ్యాలెట్ పోరాటం

Satyam NEWS

Leave a Comment