32.7 C
Hyderabad
April 26, 2024 23: 09 PM
Slider ప్రత్యేకం

వందేభారత్ కు ఖమ్మం జిల్లా ప్రజల నుండి  విశేష స్పందన

#vandebharat

భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు – వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును 15   జనవరి  సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య  ప్రవేశపెట్టారు . ఈ నెల వ్యవధిలో రైలు వినియోగదారుల నుండి ఉత్సాహభరితమైన స్పందన  పొందింది. ఈ రైలు  నాలుగు మధ్యంతర స్టేషన్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి  లలో ఆగుతుంది. ఈ మధ్యంతర  స్టేషన్లలో కూడా  ప్రయాణికుల  నుండి   మంచి ఆదరణ, ఆశాజనకమైన స్పందన లభిస్తోంది .తెలంగాణలో  ఖమ్మం  ముఖ్యమైన నగరం.

పగటిపూట ఈ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మంచి ప్రయాణ సౌకర్యం  లభించింది. ఈ నెల రోజుల్లో ఖమ్మం నుంచి వరంగల్, సికింద్రాబాద్లకు 1,182 మంది ప్రయాణికులు ప్రయాణించగా  , విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు మరో 2,768 మంది ప్రయాణికులు ప్రయాణించారు. మరోవైపు విశాఖపట్నం వైపు నుంచి 1,274 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్ కు రాగా, మరో 1,806 మంది సికింద్రాబాద్ వైపు నుంచి ఖమ్మం వరకు  ఈ వందే భారత్ రైలులో    ప్రయాణించారు.

ఖమ్మం స్టేషన్ నుండి ప్రతిరోజూ సగటున 95 మంది  వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు , మరో 106 మంది ప్రయాణికులు ఖమ్మం స్టేషన్లో ప్రతిరోజూ ఈ  రైలు ద్వారా  దిగుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు ప్రయాణీకుల నుండి విశేష  ఆదరణ లభిస్తోంది . ఇరువైపులా ( సికింద్రాబాద్ నుండి విశాఖ మరియు విశాఖ నుండి సికింద్రాబాద్ ) కు   పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. 16 జనవరి 2023 న  రైలు సర్వీసును ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు రెండు దిశలలో దాదాపు 140% సగటు  ఆక్యుపెన్సీ తో   నడుస్తోంది. ఖమ్మం నుండి రైలు ప్రయాణీకులు కూడా ఈ సెమీ-హై స్పీడ్ రైలులో ప్రయాణించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు

Related posts

అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి కి యన్టీఆర్ అవార్డ్

Bhavani

ఏఎస్ రావు నగర్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి

Satyam NEWS

2023 ఏడాది చివరి నాటికి 10 లక్షల మందికి ఉద్యోగాలు

Satyam NEWS

Leave a Comment