38.2 C
Hyderabad
April 29, 2024 14: 22 PM
Slider పశ్చిమగోదావరి

30న ఏలూరులో బిజిలి మహోత్సవం

#bijilimahotsavam

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీన ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో బిజిలి మహోత్సవం నిర్వహింస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) జి శ్యాంబాబు తెలిపారు. గురువారం ఏలూరు విద్యుత్ భవన్లోని సమావేశ మందిరంలో బిజిలి మహోత్సవం ఏర్పాట్లపై విద్యుత్ అధికారులతో ఎస్ఈ జి శాంబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో బిజిలీ మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, విద్యుత్ వినియోగదారులు హాజరవుతారని తెలిపారు. విద్యుదీకరణ మీద చిత్ర ప్రదర్శన, విద్యుత్తు పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు, అదనపు విద్యుత్తు సామర్థ్యం మీద చిత్ర ప్రదర్శన, ఒకే దేశం, ఒకే గ్రిడ్, విద్యుత్తు పునరుత్పాదన శక్తి మీద చత్రప్రదర్శన, వినియోగదారుల హక్కుల మీద చిత్రప్రదర్శన, రాష్ట్రం, జిల్లాలో సాధించిన విద్యుత్ ప్రగతి పై సమీక్ష జరుగుతుందని తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ పై సందేశం ఇస్తారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ వినియోగదారులకు నిర్విరమంగా విద్యుత్ సంస్థ ఎనలేని సేవలు అందించినదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాల కాలం అనగా 2047 లక్ష్యంగా విద్యుత్ శాఖ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.

ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఆయా రాష్ట్ర, దేశాల ప్రజలకు నిర్విరామంగా విద్యుత్తు అందిస్తేనే అవి ప్రగతి సాధించినట్లు గా గుర్తించాలన్నారు. ఈనెల 30వ తేదీన కలెక్టరేట్లోని గోదావరి సమావేశంలో జరిగే విద్యుత్ బిజిలి మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయం చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి శ్యాంబాబు ఈ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిఈ టెక్నికల్ ఎం ఝాన్సీ, ఏలూరు ఈఈ ట.శశిధర్, జంగారెడ్డిగూడెం ఈఈ కేఎం అంబేద్కర్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు తురగా రామకృష్ణ, ఏడిఈ, ఏఈలు పాల్గొన్నారు.

Related posts

ధరలు తగ్గాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పండి!

Satyam NEWS

యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి ద్విభాషా చిత్రం కోసం సన్నాహాలు

Satyam NEWS

రైతులకు జిలుగు విత్తనాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment