39.2 C
Hyderabad
May 3, 2024 14: 19 PM
Slider విజయనగరం

ప్రేమతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కు కేబినెట్ హోదా

#kolagatla

విజయనగరం ఎమ్మెల్యే కు డిప్యూటీ స్పీకర్

నాకు మంత్రి పదవి వద్దు.. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు సేవలోనే నా జీవితం అని మీడియా ముఖంగా మాట్లాడిన వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కోరుకున్నట్టుగానే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ పార్టీ కి ఇన్నేళ్లుగా ఇన్నాళ్లు గ సేవ చేసినందుకు గాను..ప్రేమతో సీఎం జగన్ ..ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. తాజాగా విడుదల చేసిన మంత్రి వర్గ కూర్పులో కోలగట్ల కు అవకాశం ఇచ్చారు.. సీఎం జగన్. ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోలగట్ల.. మొదట ఎమ్మెల్యే గాను ఆ తర్వాత వైఎస్సార్సీపీ లో చేరిన తరువాత కూడా ఎమ్మెల్యే గా గెలిచి….ఏకంగా రాజుల వంశానికి చెందిన అశోకగజపతి రాజు కోటనే ఢీ కొట్టి రాజకీయ ఉద్దండుడుగా పేరు సంపాదించకున్నారు.ఈ సందర్భంగా కాబోయే డిప్యూటీ స్పీకర్ కుటుంబాన్ని చూస్తే…

తండ్రి.. కీర్తిశేషులు.. కోలగట్ల సన్యాసి రాజు

తల్లి.. కీర్తిశేషులు. కోలగట్ల లక్ష్మి  

పుట్టిన తేదీ…28.5.1960

విద్యాభ్యాసం….. ఎం ఆర్ మోడల్ హై స్కూల్, ఎం ఆర్ కాలేజ్ విద్యార్థి దశలోనే స్కూల్ spl  పని చేశారు…

1983లో కాంగ్రెస్ పార్టీలో చేరిక,

1985లో కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గా

19 87 లో మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక

1989లో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా

1989లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ

1994, 1999 లో కూడా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ.

2004 సంవత్సరం ఎన్నికలలో విజయనగరం సప్తమ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ, మాజీ కేంద్రమంత్రి అశోక గజపతి రాజు పై విజయం.

2013సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు

2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ.

తిరిగి వైఎస్ఆర్సిపి  mlc గా  పదవీ బాధ్యతలు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనుభవం.

ప్రస్తుతం శాసనసభ్యునిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా పదవీ బాధ్యతలు…

భార్య….కోలగట్ల వెంకట రమణి, రెండుసార్లు విజయనగరం మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా ఎన్నిక,

వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి…. సంధ్య, ఎం బి బి ఎస్, జనరల్ ఫిజీషియన్

పెద్దల్లుడు…. డాక్టర్ నాగ అభిషేక్, ప్రముఖ ఆంకాలజిస్ట్

రెండవ కుమార్తె… శ్రావణి, నగర డిప్యూటీ మేయర్

చిన్నల్లుడు…. జి ఈశ్వర్ కౌశిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, వ్యాపారవేత్త.

ఇదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి రాజకీయ చరిత్ర.. చతురత.కాగా కేబినెట్ ర్యాంక్ కలిగిన డిప్యూటీ స్పీకర్ భాద్యత ను స్వీకరించనున్న కోలగట్ల వీరభద్ర స్వామి అభినందనలు చెబుతోంది… సత్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

లింగోజీగూడలో నిత్యావసరాలు అందించిన యువజన కాంగ్రెస్

Satyam NEWS

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

Satyam NEWS

ఫ్లెక్సీ తొలగించమని చెప్పాం: అధికారులే బాధ్యులు

Satyam NEWS

Leave a Comment