26.7 C
Hyderabad
May 3, 2024 09: 20 AM
Slider గుంటూరు

మంత్రి పదవి నుండి సుచరితను తొలగించడంపై నిరసన

sucherita

మంత్రివర్గం నుండి మేకతోటి సుచరిత ను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరు బ్రాడీపేట లోనే క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మంత్రివర్గంలో పాత మంత్రులైన ఎస్సీ లలో ఐదుగురిలో నలుగురికి కొనసాగిస్తూ సుచరితను ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆగ్రహావేశాలతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవసరమైతే పార్టీని వీడి స్వతంత్రంగా గెలిసి వస్తామని వ్యక్తం చేస్తున్నారు. గంట పాటు సుచరిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలు, నాయకులు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదక్షిణలు చేసి వారి నిరసనలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్ లో పంపినట్లు కూడా ఆమె అనుచరులు ప్రకటించారు. మాజీ హోం మంత్రి సుచరిత ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈనాడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి విధేయురాలు గా ఉన్న సుచరితను సజ్జల కుట్రపూరితంగా పదవి నుండి తొలగించారని విమర్శిస్తున్నారు. ఎందుకు తొలగించారో కారణం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

Related posts

పాతవారితో పని అయిపోయిందా ఎమ్మెల్యే గారు?

Satyam NEWS

కిటకిటలాడుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం

Bhavani

ప్రధాని దిష్టి బొమ్మ దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం

Satyam NEWS

Leave a Comment