39.2 C
Hyderabad
May 3, 2024 12: 59 PM
Slider కడప

రగులుతున్న అగ్నిపర్వతం: మంత్రి వర్గంలో మేడా కు దొరకని చోటు

#medamallikarjun

అన్నమయ్య రాయచోటి జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి ఏపీ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో చోటు దొరక పోవడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మంచి అభిమానం.2014 లో రాజంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్ రాక పోవడంతో టీడీపీ లో చేరి తొలిసారిగా అప్పటి కడపజిల్లా నుంచి ఒకేఒక్క టీడీపీ ఎమ్మెల్యే గా విజయం సాధించినారు.

దాదాపు 900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు.అనంతరం 2019 లో వైసీపీ లో చేరి రాజంపేట ఎమ్మెల్యే గా విజయం సాధించినారు. టీడీపీ నుంచి వైసీపీ లోకి రావడం గంజాయి వనం లోనుంచి తులసీ వనం లోకి వచ్చినంత ఆనందంగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి.వైసీపీ లో చేరడానికి కోట్ల రూపాయల ఖర్చు చేయడమే కాదు,మేడా కు మంత్రి పదవి వస్తుందని,సోదరుడు మేడా రఘునాథ రెడ్డి కి ఎమ్మెల్సీ వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేసేవారు.

కానీ వారి ఆశలు నెరవేరలేదు.టీడీపీ హయాంలో తండ్రి మేడా రామ కృష్ణా రెడ్డి కి టీటీడీ బోర్డు మెంబర్,తనకి రాష్ట్ర విప్ కట్టబెట్టారు.దాని కంటే వైసీపీ లో పెద్ద పదవులు ఆశించిన వారికి మొండి చెయ్యి మిగిలింది.ఉన్న టీటీడీ బోర్డు పదవీ కాలం ముగిసి పోయింది.రాజంపేట జిల్లా కేంద్రం కాక పోవడం,నిధులు లేక అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో చేయలేక పోవడం,ఎమ్మెల్యే మేడా కుటుంబానికి వైసీపీ లో తగిన ప్రాధాన్యత లేక పోవడంతో వారి వర్గీయులు లోలోపల రగిలి పోతున్నారు.

అంతే కాకుండా జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి వర్గీయుల తో స్వపక్షంలో విపక్షం పోరు కూడా ఎమ్మెల్యే వర్గీయులు సతమతం ఔతున్నారు.వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

ఫైర్ ఆన్ సెంటర్: కేంద్రం ఇచ్చింది బోగస్ ప్యాకేజీ

Satyam NEWS

మే లో మంత్రివర్గ విస్తరణ ?

Sub Editor 2

హుజూర్ నగర్ లో పేదల ఇళ్లను కూలిస్తే మీ పతనం తప్పదు

Satyam NEWS

Leave a Comment