40.2 C
Hyderabad
April 29, 2024 15: 44 PM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశంపై బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగితొంది. ఇరు పార్టీల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రెండు పార్టీల నాయకులు నిరసనలు తెలిపారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిఅర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపి కొనడానికి చేసిన చర్యకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బిఅర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ బిజెపి నాయకులు నీచమైన విధానాలను అవలంబిస్తున్నారని, వారు తొవ్వుకున్న గోతిలో వారే పడతారని అన్నారు. ఎన్ని కుయుక్తులు చేసిన మునుగోడు ఎన్నికల్లో బిఅర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజల మనసులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మునుగోడులో గెలవలేకనే

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేకనే అధికార పార్టీ ఫార్మ్ హౌస్ కుట్రకు తెరలేపిందని కామారెడ్డి బీజేపీ పట్టణ శాఖ ఆరోపించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయని, మునుగోడులో గెలవలేమని తేలిపోయిందన్నారు. అందుకే ఏం చేయాలో తెలియక ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని తమపై బురద జల్లే కుట్ర చేసిందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మునుగోడులో బీఆర్ఎస్ ఓటమి తప్పదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తమ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

Related posts

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

Satyam NEWS

ఫిలిం ఓటీటీ లో త్రిష, నివిన్ పాలీ ”హే జూడ్” 5న ప్రీమియర్

Satyam NEWS

ఎండ‌ను లెక్క చేయకుండా సిబ్బందిని అలెర్ట్ చేస్తున్న పోలీస్ బాస్…!

Satyam NEWS

Leave a Comment