28.7 C
Hyderabad
April 26, 2024 07: 52 AM
Slider విజయనగరం

ఐదు భద్రత పట్ల అవగాహన, ఆచరణకే “శౌర్య”

విజయనగరం జిల్లాలో ప్రజలను ట్రాఫిక్ సేఫ్టీ, సివిల్ సేఫ్టీ, సైబరు సేఫ్టీ, నార్కోటిక్ సేఫ్టీ, మరియు వుమెన్ సేఫ్టీ, పట్ల ప్రజలు, మహిళలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ‘శౌర్య” కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను జిల్లా ఎస్పీ తెలిపారు.

“శౌర్య” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, అపార్టుమెంట్లు, వర్కింగ్ ప్రదేశాల్లో ముందుగా టైం స్లాట్ తీసుకొని, కొద్ది మాసాల్లో అన్ని రంగాల్లో విద్యార్థులు, మహిళలు, ప్రజలు, మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సేఫ్టీ, సైబరు సేఫ్టీ, సివిల్ సేఫ్టీ, నార్కోటిక్ సేఫ్టీ, వుమెన్ సేఫ్టీ పట్ల అవగాహన కల్పించే బాధ్యతను చేపట్టామన్నారు.

లైంగిక వేధింపులు, మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం, రహదారి భద్రత, సైబరు నేరాలు, పౌరుల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులను, మహిళలను లక్ష్యంగా చేసుకొని, అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఈ అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు బుక్ లెట్స్ కూడా రూపొందించి, విద్యార్థులకు ఇవ్వనున్నామని, అవగాహన కల్పించిన తరువాతన వారిలో చైతన్యం, ఉత్సాహాన్ని నింపేందుకు క్విజ్ పోటీలను కూడా నిర్వహించనున్నామన్నారు.

ఈ అవగాహన కార్యక్రమాలను కేవలం విద్యా సంస్థలకే పరిమితం కాకుండా అపార్టుమెంట్లు, కాలనీలు, గ్రూపు ఇళ్ళు, ముఖ్య కూడళ్ళుకు విస్తరింపజేసి, ప్రజలందరికీ భద్రత పట్ల అవగాహన కల్పించి, నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు.అనంతరం రోటరీ ఫోర్టు క్లబ్ మెంటర్ రవి కె మండ మాట్లాడుతూ – ప్రజలు అన్ని రంగాల్లో అవగాహన, ప్రజ్ఞ ఎంత సంపాదించుకున్నప్పటికీ, ఏదో విధంగా వంచించబడుతూనే ఉన్నారన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి, చెడు మార్గాల్లో ప్రయాణించి, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.

పోలీసుశాఖ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. రోటరీ ఫోర్టు క్లబ్ సామాజిక బాధ్యతగా పోలీసు శాఖకు బాసటగా నిలవాలని భావిస్తూ, పోలీసుశాఖ భాగస్వామ్యంతో ‘శౌర్య’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించామని రవి కె మండ అన్నారు.అనంతరం, రోటరీ ఫోర్టు క్లబ్ ప్రత్యేకంగా రూపొందించిన శౌర్య వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆవిష్కరించారు. ఆసక్తి కలిగిన కాలనీ ప్రజలు, అపార్టుమెంటు సభ్యులు అవగాహన పొందేందుకు, కార్యక్రమ నిర్వహణకు 9182615056, 8096953117, 8459179307 ఫోను నంబర్లు సంప్రదించవచ్చునన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తో పాటు డిఎస్పీ టి.త్రినాధ్,రోటరీ ఫోర్టు క్లబ్ మెంటర్ రవి కే మండ, అధ్యక్షులు అవినాష్, సెక్రటరీ మనీష్ విజస్వని, సిఐలు జి. రాంబాబు, సిహెచ్.లక్ష్మణరావు, విజయనాధ్, ఆర్ ఐ పి.నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani

మే లో మంత్రివర్గ విస్తరణ ?

Sub Editor 2

జాతీయ స్థాయి ఉగాది పురస్కారం అందుకున్న గుండబాల మోహన్

Satyam NEWS

Leave a Comment