Slider ముఖ్యంశాలు

దేశాన్ని విచ్చిన్నం చేసే బీజేపీ కుట్రలను ఎండగట్టాలి

దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న బీజేపీ కుట్రలను నేటి యువత అధ్యయనం ద్వారా ఎండగట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ధవారం ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం AIYF రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షత న నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను ఆమోదిస్తూ, దేశ సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని, దీని కారణంగానే దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యమే బీజేపీ ప్రధాన అజెండాగా పాలన సాగుతోందని వారు విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200పైగా ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయయని, దీని ప్రభావంతో నే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత తమ ఉద్యోగాలను కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానన్న మోడీ హామీలు ఏమయ్యాయయని వారు ప్రశ్నించారు.కేవలం మాటల గారీడీ,హిందూత్వ పోకడలతో దేశ యువతను నాశనం చేస్తున్నారని, ఈ చర్యలు దేశ భవిష్యత్తు కు పెను ప్రమాధంగా మారుతాయని వారు ఉద్ఘాటించారు.

అదే విధంగా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజాధరణ లేదని, మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలనే ప్రజలలో బీజేపీ కి ఏ మాత్రం కూడా అనుకూలత లేదని, బీజేపీ అభ్యర్థి కి ఓట్లు పడే అవకాశం లేదని వారు అన్నారు. దీనిని మునుగోడు యువత నిశితంగా గమనించాలని, వామపక్ష పార్టీలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో తో గెలుస్తున్నాడని,అందుకే వామపక్ష,లౌకిక, ప్రజాతంత్ర శక్తులంతా తమ ఐక్యత ను చాటాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నెర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసిఆర్ కే సాధ్యం

Satyam NEWS

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

Satyam NEWS

లహరి-అమ్మఒడి అనుభూతి

Murali Krishna

Leave a Comment