తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని రద్దు చేయాలని బిజెపి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం బిజెపి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయన కల్వకుర్తి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట కల్వకుర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం తహసిల్దార్ రాంరెడ్డి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఓ పక్క ప్రజలకు ఉపాధి కరువై తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతుల పంటలు సరిగ్గా పండగ ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ సాగుతో ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు దుర్గ ప్రసాద్, కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,నాయకులు బోడ నర్సింహ,రహమతుల్లా, వీరస్వామి,రవి గౌడ్,రాంరెడ్డి, నరేష్ గౌడ్,అంజన్ రెడ్డి, శ్రీపతి, శ్రీశైలం,బాబి,మధుసూదన్ రెడ్డి,నరసింహారెడ్డి,పవన్ కళ్యాణ్,భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.