హిందూ దేవాలయాల పట్ల చిన్న చూపు చూస్తున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యధోరణికి వ్యతిరేకంగా చలో సికింద్రాబాద్ RDO ఆఫీస్ కు విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి.
30 తేదీన( బుధవారం) ఉదయం 11.00 గంటలకు సికింద్రాబాద్ RDO ఆఫీస్ ను ముట్టడించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మెత్ నగర్ డివిజన్ లోని ఇంద్ర నగర్, SPR హిల్స్ లో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి మందిరాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని ఖైరతాబాద్ MRO తీసుకునివెళ్లారని తెలిపారు.
ఈ దారుణ సంఘటనపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేక పోవటాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తీవ్రంగా ఖండించాయి.
హిందువులపై చూపిస్తున్న పక్షపాత ధోరణిని నిరసిస్తూ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు.
శ్రీ ఆంజనేయ స్వామి మందిర ధ్వంసం విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తెలిపాయి.