26.7 C
Hyderabad
May 3, 2024 10: 53 AM
Slider ప్రత్యేకం

వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష

#kalvakuntlakavita

బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని మరోసారి ‌ఎండగట్టిన ఎమ్మెల్సీ కవిత

2020 లో భారీ వర్షాలు, వరదలతో  తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు.

2021-22 లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్‌ఎఫ్‌) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. కేంద్ర నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ప్రస్తావించారు.  వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్నారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న  వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

2021-22 లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణ కు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకొన్నది. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాశారు. కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు.

Related posts

(Best) Cbd Oil Pure Relief Cbd Oil Legal In Nevada

Bhavani

వైఎస్సార్ టిపి జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బోరికి సంజీవ్

Satyam NEWS

115V బస్ ను పునః ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

Satyam NEWS

Leave a Comment