27.7 C
Hyderabad
April 30, 2024 09: 46 AM
Slider విశాఖపట్నం

విశాఖ బీజేపీ నేత పి విష్ణు కుమార్ రాజు హౌస్ అరెస్ట్

#HouseArrest

అమలాపురం- అంతర్వేది  కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన బిజెపి నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

రేపు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజును పోలీసులు సెక్షన్ 151 CrPC కింద గృహ నిర్భధం చేశారు.

తనపై పోలీసు చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూ ధర్మ రక్షణ కై పోరాడుతున్న నాయకులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తనను పోలీసు వారు గృహ నిర్బంధం చేయడం అన్యాయమని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రజా హక్కులను అణిచివేతకు ఇది  నిదర్శనమని, ఈ ప్రభుత్వం  వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

Related posts

వీడిన పిన‌వేమ‌లి హ‌త్య కేసు మిస్ట‌రీ…కార‌ణం అదేనంట..ఎస్పీ వెల్ల‌డి….!

Satyam NEWS

భారత్ లో కరోనా కట్టడికి సాయం అందిస్తున్న అమెరికా

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో “స్పందన” తీసుకున్న ఏఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment