26.7 C
Hyderabad
April 27, 2024 07: 28 AM
Slider విజయనగరం

వీడిన పిన‌వేమ‌లి హ‌త్య కేసు మిస్ట‌రీ…కార‌ణం అదేనంట..ఎస్పీ వెల్ల‌డి….!

#VijayanagaramPolice

కొన్ని హ‌త్య కేసులును  పోలీసులు క్ష‌ణాల‌లో ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసారు. మ‌రి కొన్ని కేసుల‌ను చేధిండంలో మీనం మేషాలు లెక్కిస్తారు. కొన్నింటిలో స‌రైన ఆధారాల కోసం నిరీక్షిస్తుంటారు..ఇంకొన్నింటిలో అప్ప‌టికి ప్రస్తుత ప‌రిస్తితుల బ‌ట్టీ వేచి చూస్తారు. 

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌గ‌రం మండ‌లం పిన‌వేమ‌లి హ‌త్య కేసు ద‌ర్యాప్తును ఎట్ట‌కేల‌కు రూర‌ల్ పోలీసులు చేధించారు. డీఎస్పీ అనిల్ సూచ‌న‌ల‌తో  రూర‌ల్ సీఐ మంగ‌వేణి,ఎస్ఐ లు నారాయ‌ణ‌,దామోద‌ర్,త్రినాథ రావు, కానిస్టేబుళ్లు ష‌పీ,సాయిశంక‌ర్ లు  బృందంగా ఏర్ప‌డి సంయుక్తంగా అతి త‌క్కు వ వ్య‌వ‌ధిలోనే కేసు మిస్ట‌రీని చేధించారు.

స‌రిగ్గా ఎన్నిక‌ల అనంత‌రం  పిన‌వేమ‌లిలో హ‌త్య జ‌ర‌గ‌డంతో…ఎన్నిక‌ల సంద‌ర్బంలోఈ దారుణం జ‌రిగింద‌ని అంద‌రూ  భావించారు.కాని…ఈ హ‌త్య కు గ‌ల కారణం.. మ‌ద్యం,లైంగిక కారణాలు గా పోలీసులు నిర్ధారించారు. ఈ మేర‌కు జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జిల్లా ఎస్పీ ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

ఫిబ్ర‌వ‌రి 17న పిన‌వేమిలో జ‌రిగిన 24 ఏళ్ల రవి హ‌త్య కేసులో నిందితుల‌ను ప‌ట్టుకుని మీడియా ముందు ప్ర‌వేశ పట్టారు…రూర‌ల్ పోలీసులు. ఈ సంద‌ర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…మృతుడుర‌వికి…స‌న్నిహితుడు బాల పైడిరాజుకు మ‌ధ్య  ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంద‌ని దీనికితోడు మ‌ద్యం,సెక్సువ‌ల్ అంశంలో ఈ దారుణం జ‌రిగింద‌ని అందుకు త‌న ఇద్ద‌రు స్నేహితులైన స‌త్య‌నారాయ‌ణ‌,కిర‌ణ్,నారాయ‌ణ‌ల‌తో సాయంతో మృతదేహాన్ని స్థానికంలో  ఉన్న చెరువులో ప‌డేసారని ఎస్పీ తెలిపారు.

నెల రోజులైన వాళ్ల‌ను త‌మ శాఖ ప‌ట్టుకోలేక‌పోవ‌డంతో…గండం గ‌ట్టెక్కింద‌ని…మొక్కు తీర్చుకోవ‌డం కోసం తిరుప‌తి వెళ్లి త‌ల‌నీలాలు అర్పించార‌ని ఎస్పీ తెలిపారు. అయితే హ‌త్య జ‌రగిన ప్ర‌దేశంలో మ‌ద్యం బాటిళ్లు, అనంత‌రం ఫోర్స‌నిక్ నివేదిక ఆధారంగా…ద‌ర్యాప్తు మరింత వేగంగా చేయ‌డంతో..ఎట్ట‌కేల‌కు 60 రోజుల‌లోపే నిందితుల‌ను స‌బ్ డివిజిన్ పోలీసులు ప‌ట్టుకోగ‌లిగార‌ని ఎస్పీ తెలిపారు..

ఈ  సంద‌ర్భంగా చాక చ‌క్యంగా కేసును చేధించిన రూర‌ల్ సీఐ మంగ‌వేణికి  ఎస్పీ..వెయ్యి రూపాయ‌ల పారితోష‌కం అంద చేసి…ఇదే స్పూర్తి మిగిలిన అన్ని కేసుల‌లో చూపించాల‌ని వెన్ను త‌ట్టారు

Related posts

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

పోలీసుల అదుపులో మావోయిస్ట్ అ్రగనేత భార్య

Satyam NEWS

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

Leave a Comment