39.2 C
Hyderabad
May 3, 2024 11: 18 AM
Slider నిజామాబాద్

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

#ministervemula

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలం దూదిగాం గ్రామం నుంచి బీజేపీ పార్టీకి చెందిన యువకులు మంగళవారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (RDC) ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ తో కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిన బాల్కొండ నియోజకవర్గం దూదిగాం గ్రామ యువకులకు మంత్రి స్వాగతం పలికారు.ఇక నుండి మీరు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులని అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందన్నారు.బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి మీ కళ్ళ ముందే కనిపిస్తోందన్నారు.సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి,దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. బీజేపీ మోడీ కి భయపడి కరెంట్ మోటర్లకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మీటర్లు పెడుతున్నారని,ముఖ్యమంత్రి కేసిఆర్ ఏది ఏమైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని,మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్రానికి తెగేసి చెప్పారన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు..

మెండోరా మండలం ధూద్గామ్ గ్రామానికి చెందిన బిజెపి మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ మరియు బుస్సాపూర్ సొసైటీ డైరెక్టర్ అయిలి నరేష్ మరియు అనుచరులు 25 మంది. మల్లేష్,సరికేల సంజయ్,మురళి ,మతిన్ ఖాన్,విజయ్,హరీష్,ప్రదీప్, చినబాబు, జ్ఞాని, రాజు, సుభాష్,ప్రశాంత్,దిలీప్ రాకేష్,దేసు అక్షయ్,రాము శ్రీకాంత్,అశ్వంత్ తదితరులు చేరారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ,గ్రామ ప్రెసిడెంట్ రాజేందర్,సర్పంచ్ శ్రీనివాస్,ఎంపిటిసి దేవేందర్,జిల్లా రైతు బంధు నాగుల నర్సయ్య,ఎక్స్ ఎంపిపి రాజారెడ్డి,ఉప సర్పంచ్ శ్రీనివాస్,ఎక్స్ ఎంపిటిసి బాబా,జి.శ్రీనివాస్,అశోక్,గోపి,అక్తర్,అశోక్,చిట్టి వెంపల్లి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

Satyam NEWS

సమత అత్యాచారం కేసులో ఎదురుతిరిగిన నిందితులు

Satyam NEWS

శిక్షణలో క్షేత్రస్థాయి సందర్శన అత్యంత కీలకం

Sub Editor 2

Leave a Comment